పుట:Bhaarata arthashaastramu (1958).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రత్తిని వేఱుసేయుట. బోనువంటి నోరు దెఱచికొనియుండు గొట్టములో పొలములనుండి తెప్పింపబడిన దూదిని వేయ నది యంత్రజనిత మహావాయువుచే నతివేగముగ గొట్టుకొనిపోబడి చిన్నరంధ్రముల గల యొక యినుపపలకకుం దగులును. ఆ యాఘాత జృంభణమ్మున ప్రత్తిమాత్ర మాపలకలోని రంధ్రములలో దూరిపోవునుగాని బీజముల కన్న బెజ్జములు చిన్నవగుట గింజలు వెనుక నిలుచును. దినమంతయు నీగొట్టములో ప్రత్తినిదూర్చుచు నొకడుండును. అనగా నొక్కకూలివాని సంపూర్ణ ప్రయాసమునకు దగినంతదూది బండ్లలోవచ్చి దిగుచుండుననుట. అంతదూదిరానిచో వీరికి కూలితోడ రజా యియ్యబడినట్లు విరామముగా నుండును. గింజలులేని ప్రత్తిని మఱికొన్ని యంత్రములు లాగుకొనిపోయి ముఱికి, మన్ను మొదలగు నశుద్ధములం బోగొట్టి, పరిశుభ్రముగా జేయును. శుభ్రమైన దూదిని నలిపి, పిసికి, బాగుగాగలిపి, చిక్కపఱచు నంగములుకొన్ని, దట్టమై బిగువెక్కిన పిమ్మట నొక యంగుళము వెడల్పుగల పోగులుగాదీయు నవయవములుకొన్ని, చక్రాకారముగా దిరుగుచు నాపోగుల పలురకముల సన్నని తిన్నని కనుపులులేని దారములుగా విడదీయు నంగములు కొన్ని, వడికి నూలునదిమి బస్తాలుగాగట్టు నంగములుకొన్ని, ఇట్లు భిన్నవ్యాపార సాధనము లనేకములున్నవి ఈయంగములన్నియు నిలువక పనిచేయునంత సరకులు వచ్చుచుండునుగాన నీవిశ్లేషణము లాభకరము. సరకులుచాలకపోయిన నప్పుడప్పుడు పనినినిలుపుట తటస్థించును. కాలము తఱుచు మిగిలెనేని ఒకయంగముచేతనే యనేక కార్యము లొకదానివెనుక నొకటిగ జేయవచ్చును గాన శ్రమవిభజన మనావశ్యకము. వ్యవసాయమున నిరంతర కృషి లేదుగాన నీపద్ధతి యందు జెల్లదు. ఈ వీలులేమికిం గారణంబేమి? వ్యవసాయ స్వభావంబె. వానలు, కారులు వీనిని వేచిచేయబడునదిగాన అవ్యవహిత యత్నమున కాధారములేదు. మఱియు దున్నినవెంటనే చల్లుటతగదు. చల్లిన