పుట:Bhaarata arthashaastramu (1958).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. శిల్పులసంఖ్య. ప్రతిక్రియను ఎక్కువగా జరుపవలయునన్న ఎక్కువ పనివాండ్రుండ వలయుననుట విశదము.

2. సరకు లుత్కటములగుటయె యీ విభజనముయొక్క సంకల్పము. గిరాకిలేనిది యురువుల మూర్కొనంజేయుటలో లాభము లేదుగాన గిరాకి రెండవది.

3. వృత్తుల స్వభావము.

మొదటిది:- వస్తురచనలో బ్రత్యేకపఱుపదగిన క్రియ లెన్ని యున్నవో యంతకన్న నతిశయముగ శ్రమ విశ్లేషణ మొనర్చుట తరముగాదు. ఉదా. మామిడితోటల విషయమై క్రియల భిన్నతకుం బాత్రముల నివేదించితిమి. సహజభిన్నములైన క్రియలంగాక సంకలిత క్రియలనుసైతము వికల్పింపజూచిన వ్యవహారములకు వైకల్యము సిద్ధము. ఎట్లన గంపలనించుటలో నొక్కొక్కకాయ నెత్తియిడుట కొక్కడని, కుట్టుటలో ప్రతికుట్టువేయుటకు నొక్కొక్కడని, ఇట్టి నియమముల జేసినదానిపేరు శ్రమవికల్పముగాదు. బుద్ధి వికల్పము.

రెండవది:- ప్రత్యేక క్రియలున్నను వానియం దొక్కొక్కటియు కాలపూరణము చేయదగినంత విపులతలేనివైన బ్రత్యేక కళలుగజేయుట హానికరము. దృష్టాంతము. ప్రత్తియంత్రశాలలో నుద్యోగ విభజనము సమగ్రమైయున్నది. సేద్యములో నంతపరిపూర్ణత యే దేశములయందును వహింపలేదు. దీనికిం గారణంబు లరసిన నీన్యాయంబు వ్యక్తపడును.

నూలువడకు యంత్రశాలలోని యంగభాగముల వివరము:- మధ్యభాగమున నన్నిచక్రములకు బిసలకు గమనశక్తి నొసంగు నావిరియంత్ర మొకటియుండును. దీనిలో నుద్భవించుశక్తిని రాట్నములద్వారా ప్రత్యంగమునకును వ్యాపింపజేయుదురు. ఇక నీశక్తిచే సాధింపబడు కార్యజాతముల వివరము:- ప్రప్రథమము గింజలును