పుట:Bhaarata arthashaastramu (1958).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నివేశవృత్తి పద్ధతి పూర్వోదిత పద్ధతులకన్న నుత్పత్తి ఎక్కువ గలది. వాణిజ్యవ్యాప్తియు, సరకులకొలది వాణిజ్యము నాతతముచేయ నుత్సహించు వర్తకుల నాయకత్వమును, వృద్ధిబొందించుటయందు నిది యుద్దీపకమై యుండును.

ఇంకను బేహారములు పెచ్చుపెఱిగిన నుత్పత్తియు విపులత బూనవలయును. ఐన నట్టిమహోత్పత్తికి నివేశనవృత్తులు నిదానములు గావు. మఱి యావేశనవృత్తు లందుకు ప్రధాన కారణములు.

ఆవేశనవృత్తి

ఆవేశనమనగా కర్మశాల. కర్మకరులెల్లరు గుమిగూడి కష్టించు ఫ్యాక్టొరీలు.

నివేశనావేశనవృత్తులుకుంగల తారతమ్యములు:-

1. వారివారి యింటనేయుండి పనులం గావింతురేని కాలము వ్యర్థపుచ్చక చక్కగా శ్రమపడుచున్నారా లేదా యని విచారించుటకు వీలుండదు. కర్మశాలలలో భృత్యులను పరిశోధించుట సులభము గాన కార్యము లతిత్వరితముగ నడుచును.

2. ప్రత్యేక గైహికకళలున్నచో నెక్కువ మూలధనమును వేసి గంభీరములైన యంత్రములతో సరకుల దయారుచేయగాదు. గుడిసె గుడిసెకు నొక దూదియంత్రమును ప్రతిష్టింపజూచుట వ్యాపారమా, హాస్యమా?

3. అల్పోత్పత్తికిమాత్రమునకు పనుల భిన్నములంజేసిన నవి త్వరలో ముగియుటకు వచ్చుంగాన కాలమెల్ల వినియోగింపబడక మిగులుటచే నష్టము దెచ్చును. ఉదా. మామిడితోట చిన్నదిగానున్న గాయలగోయుట కొకనిని, కోసినవానినేర్పఱచి గంపలలో నింపుట కొక్కని, గంపలగట్టుట కొక్కని, ఆగంపలను రైలునకు దోలుకొని పోవుట కొక్కనిని, ఇట్లు నలుగురిని నియమించిన ప్రతివాడును బంట