పుట:Bhaarata arthashaastramu (1958).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొడయలై యుండుటయకాక విరచితార్థంబులను నేరుగా వినియోజకుల కమ్ముచుండిరి. ఉత్పత్తికరులకు వినియోగపరులకును నడుమ మధ్యవర్తు లెవ్వరులేక ప్రత్యక్షవ్యాపారములుండెను. కాలక్రమమున, వాణిజ్యచక్రము విరివినొంది నలుదెసలం బ్రసరించుకొలది చేయువారికిని, అనుభవించువారికిని దూరమెక్కువయై యపరోక్షవణిగ్వఠ్తనము పరిహృతంబయ్యె. కర్మకరులయొద్దగొని యుపయోజకుల కమ్ము వాణిజ్యమార్గ ముత్పన్నమై మధ్యమున నిలిచినందున నుత్పాదకులు వర్తకుల నాశ్రయింప వలసివచ్చిరి. మఱియు వాణిజ్యము వ్యాప్తమగుటచే ప్రాచీనపద్ధతిని పరిసరములమాత్ర మెఱింగినవారు దూరపు సమాచారముల నెఱుంగునంత చతురులుగారు గావున మధ్యవర్తులు చెప్పినట్లు వినవలసిన వారైరి. నేరుగజేయు వ్యవహారములుపోయి యితరుల మూలముగ నడుపవలసినవిధుల కధీనులైరి.

వర్తకా ధీవవృత్తులు రెండు తెఱంగులు. నివేశనవృత్తులు, ఆవేశనవృత్తులునని.

నివేశనవృత్తి

నివేశనమనగా నిల్లు. ఇంటివారు తమకుంగాక వర్తకుల ముదల మేరకు నివాసములలో జేయుపనులు నివేశన వృత్తులునాబడు. ఉదా. మునుపు వివరింపబడినట్లు ఉపయోజకులకు నేరుగ సమర్పించుటకుం గాక తమయొద్దగొని యమ్ము వర్తకులకు నిచ్చుటకై తదా దేశ విధేయులై సాలెవారు మొదలగు శిల్పులు తమ నివేశములలోనే నేతపని మొదలగు శిల్పముల జేయుదురేని అది నివేశనవృత్తి.

నివేశనవృత్తులకును గైహిక కళలకును భేదముగలదు. గైహిక కళలనగా గృహస్థులు తమ సంతోష సుఖములకై చేయుకుట్టుపని, అలంకారరచన మొదలగునవి. వృత్తులలో జీవనోపాయసిద్ధి ముఖ్యో ద్దేశ్యము. ఈ ద్వివిధ శిల్పులకు నొకనామముండినను సందర్భాను గుణమై యోచించిచూచిన బొరపాటుల కెడముండదు.