స్పష్టము. సమగ్ర వాణిజ్యముగల దేశములో నెవరైన, తుదకు పరదేశములవారైన గొందురను నాశమై వర్తకులు వస్తువుల దయారుచేసి గ్రాహకులకై నిరీక్షించు చుందురు. వర్తకులకు బేరసారములు పొటకరిల్లి యుండుటంజేసి సాధారణముగ నష్టమురాదు. గ్రామములు చిన్నవియు క్రయవిక్రయము లంతగా లేనివియు నౌటంజేసి నిరీక్షింపబడని వారెవరైనవచ్చి కొందురనుట యబద్ధము. కావున కుమ్మరి కమ్మరి ఇత్యాదులు అర్థులను నిరీక్షించి కుండలు కొడవండ్లు ప్రోగుచేసిన నాస్తి చేరుటయేమోకాని యార్తియగుట తప్పదు. ఇపుడు నగరములలో గిరాకిదారులు వినిశ్చితులు గాకున్నను విపుల వ్యాపార ప్రదేశములు గావున లాభాపేక్షచే సాహసించి యంగళ్ళలో నన్నివస్తువులను నింపెదరు. ఈ సాహసమున కాశ్రయమేదనగా; రామస్వామి, అయ్యాసామి, వీరు, వారు అను నికరమైన పుణ్యాత్ములు రాకయున్నను, సరాసరికి ఇందఱు జను లేయనామధేయులోవచ్చి పదార్థముల గొందురను నమ్మిక. పల్లెటూళ్ళలో గొనువారు ప్రముఖులు గొందఱె. వీరు కొనరేని సరకులు కుళ్ళవలసినదే. బేరసారము లత్యల్పములుగాన సరాసరుల గొలుచుట పిచ్చితలంపు గావున దొలుత నుత్తరువుల జెందనది వస్తురచన కెవ్వడు దొడంగడు వాణిజ్యము కృషి శిల్పాది కళలును, అర్థమను మహారథమునకు చక్రములవంటివి. రెండును సమముగ బోవునవికాని యొకటి కాశివద్ద దిరుగుచున్న నింకొకటి రామేశ్వరమునొద్ద మసలుట ప్రకృతవిరోధం. వాణిజ్యము విస్తృతమైన గళాచక్రము యథాక్రమముగ విరివిగాంచును. గ్రామపద్ధతియందు రెండును హస్వములును నలక్ష్యములు నై యున్నవి.
4. పై వానిలోనెల్ల గలిసిన యంశమింకొండుగలదు. అదేదన, ఇట్టి స్థితిచే జనులేకరీతిని పురాణ సరణి నుందురేకాని నూతనములైన యూహలు, కోరికలు, ఉద్యమములునుం గలలోనైన గాననేరరు.