పుట:Bhaarata arthashaastramu (1958).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమూహములయందలి మూఢానురాగ భక్తులను బ్రొయ్యినిడి బొగ్గులుగగాల్చుట మొదటిపని! గ్రామ్యపద్ధతి స్వాతంత్ర్యమునకు విరోధి. స్వతంత్రతాబుద్ధి రాదేని గ్రామ్యపద్ధతి యనశ్వరము. కావున దేశలాభానుగుణమైన స్వతంత్రత సర్వజన సేవ్యంబు.

గ్రామ్యపద్ధతిలో జనులకు స్వతంత్రత లేదనుటకు నిదర్శనములు

1. ఐరోపాలో గృహనిర్మాణ విషయములో ముఖ్యముగా గణింపబడునవి గదులు. ప్రతివారును బ్రత్యేకముగ చదువు సాముల నెఱవేర్చికొనుటకు ఒక్కొక్కరికి నొక్కొక గదినిచ్చుట వారిలో నాచారము. మనలో పూజా పునస్కారములదక్క తక్కిన కార్యములకు అరలు దుర్లభములు. ధనికుల యిండ్ల సయిత మివి గానరావు. అందఱును మందరీతిని గుమిగూడి రేయుంబవలునుండుట పెద్దల తరముల నుండియువచ్చిన యాచారము. మనలో నంతరంగములను నవిలేవు. అన్నియు బహిరంగములే! పల్లుతోముట, మొగముగడుగుట, స్నానముచేయుట, వస్త్రములధరించుట ఇవి యింగ్లాండులో పరమరహస్యకార్యములు. మనవారిలో నన్న లక్కలు సరస విరసముల విరచించుచు కాంగ్రెస్‌మహాసభగా జేయు నుల్లాసకార్యములు. ఒకవేళ ఈ హేయంపు బ్రదుకు దరిద్రత, తస్కర భయము, పిఱికితనము వీనిచే నిలుపబడినదేమో. ఎట్లును సహకుటుంబములే దీనికి గారణములు. ఇంతయేకాక నాకు వేదాంతుల తత్త్వముల మీదను ననుమానము గల్గుచున్నది. ఎందులకందురో. వేదాంతులు నిరహంకారత్వ నిర్మోహత్వములం జాటెదరుగదా! ఈ గుణములు పట్టువడుటకు బన్నిన యుపాయములో మనయిండ్లు? ఎట్లన మఱుగు మానమునులేనిది మోహములు నివ్వటిల్లవు. సర్వమును బట్టబయలుగనున్న నింతేనాయని తూలనాడి తొలగుదుము. కావున విరక్తి జనించుటకై మనకు కొట్టము లమర్పబడియెగాబోలు! ఈ యపహాసములతో బ్రయోజనములేదు. ముఖ్యన్యాయము లివి. మఱుగు మానము లొండొంటి