పుట:Bhaarata arthashaastramu (1958).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తులు విశ్లేషింపవేని యుత్పాదకశక్తి లఘువగుననియు, ఈ విశ్లేషణము, నిరాతంక వాణిజ్య సంశ్లేషణము, నితరేతర పోషణములనియు జక్కగా గ్రహింపవలసిన విషయము. వాణిజ్యము పెఱుగు కొలది నుత్పత్తి యధికము గావలసివచ్చును ఉత్పత్తి యనర్గళము గావలయునన్న శ్రమవిశ్లేషణము, నధికముగనుంట యావశ్యక కృత్యం. శ్రమ విశ్లేషణము విషయమై ఇక ముందింకను వ్రాయబడును.

గ్రామ్యవ్యవహారమువలన గలుగు కీడులు

1. ఆచారాద్యఖిల పాశబద్ధులౌట.

2. రాకపోక లల్పములగుట.

3. వాణిజ్యహాని.

విలుచుట కనువులేనిచో నెక్కువగ నుత్పత్తిచేయ నెవరు పూనుదురు? ఎక్కువగా నుత్పత్తిలేనినాడు వృత్తులు విశ్లేషించుట కవకాశము తక్కువ కావుననే మనయిండ్లు సర్వకర్మములకు నాకరములై శిల్పశాలలట్లుండుట! మఱియు గొన్నికార్యములకుం బూనక యన్నింటికిం దొడరిన నార్జన మచ్చికవడు, నను న్యాయము ప్రకారము విశ్లేషణములేనిది దారిద్ర్యము తుదముట్టదు.

కావున మనగతి ఎట్టిదనిన:- దారిద్ర్యముచే విశ్లేషణ వ్యాపింపకున్నది. విశ్లేషణ తఱుచు లేమి దారిద్ర్యము వదలకున్నది. ఇవి యన్యోన్యాశ్రయములు గాన, నశించిన రెండు నొకటిగా నశించును. అనగా ఆఢ్యత, వాణిజ్యము వలయునేని చిల్లర మల్లరలెల్ల నాశ్రయించుటమాని యేదైన నొకవృత్తి నవలంబించి తద్ద్వారా ఇప్పటికన్న నెక్కువగ సంపాదించి జనులు సుఖభాక్కులు గావచ్చును.

భిన్నవృత్తులు

మనలో జనుల కేకవృత్తిప్రాప్తి యింకను లేకపోయినను గొంతవఱకు వృత్తులు విభక్తములయినవనుట నిక్కము. మృగయా