పుట:Bhaarata arthashaastramu (1958).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెండ్లాలను బనిచేయుడని యానతిచ్చి తాము చుట్టగాల్చుచు హాయిగాగూర్చుండి తనికీచేయుచు నిష్కర్ములై యుండవలయునను నిచ్చ. అనేక జాయత్వ వ్యాపార ప్రారంభమున కిట్టియోచనలే ప్రధానములు. ఏదేశమున స్త్రీలు బిడ్డలును పశుసమానులుగ బరిగణింపబడుదురో, యచట పశుసంతతి యెంత తఱుచైన నంతమేలు; అను న్యాయప్రకారము, భార్యాసమృద్ధిని, సంతాన సంపదను బడయగాంచుట, అర్థసమృద్ధ్యాది శోభనసహితంబగుట, సదాచారసమత వహించును. ప్రకృతము మనలో నిట్టి దౌర్భాగ్యపు నడవడులు మిక్కిలి కొఱతవడియున్నను, ఇంకను గృహకృత్య సౌలభ్యమునకై ద్వితీయ వివాహములకు సమకట్టువారు తుట్రాగా లేకపోలేదు.

వైవాహికాద్యాచారముల యుత్పత్తి

వైవాహిక నియమములకు బుట్టినిండ్లు ధర్మశాస్త్రములుగావు. మఱి యార్థిక స్థితిగతులు. దారిద్ర మతిశయించుటచేగాని, ఇరుగు పొరుగు శత్రుజాతులవారిచేనైనగాని, యొకతెగవారి కుత్పాతములు ప్రసన్నములయ్యెనేని, యే ఋషీశ్వరుని ప్రేరేపణమును లేకయ, సుఖ రక్షణముల నపేక్షించి యెట్టిమార్గముననైన గొడుకుల గాంచ నెంచుట స్వాభావికగుణము. మనపూర్వులైన ఆర్యులు, ఈదేశముపై దండెత్తివచ్చిన యాదికాలమున వారిసంఖ్య స్వల్పము. శాత్రవులన్ననో లెక్కకు మీఱియుండిరి. యుద్ధములు ప్రతిదినచర్యలు. అట్లగుట "అపుత్రస్య గతిర్నాస్తి" యని నుడివిరి! అనగా సంఘమునకు శత్రుమోక్షణము సంపాదించుకొఱకేకాని తమయాత్మల నింద్రలోకములోనిలిపి యన్యాయముగ నగ్నిలో నేయివోసి పాడుచేయుటచే తృప్తిజెందించుటకుంగాదు. సంఘముయొక్కయు, తద్వారా ప్రజలయొక్కయు స్థితికై పుత్రులంబడయుట ప్రాణాధార సంస్కారమయ్యె! దానంజేసి మనకిప్పుడు నీతిబాహ్యములు, రోతలుగదోచుమార్గంబుల నైన సంతానప్రాప్తి కారంభించి విచ్చలవిడిగ సంబంధములకుం