పుట:Bhaarata arthashaastramu (1958).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల సర్వవిధముల సిద్ధపఱచి యమ్ముదురు. జాతిమతాది భేదరహిత రమణీయ రాజ్యముగాన యథేచ్ఛముగ వస్తువుల గొనవచ్చును. దానంజేసి వారిగృహములు పరిశుభ్రములై నచ్చు నవయికలులేక హృదయానందకరంబులై సంసారతమంబు నడంపంజాలు తేజస్సులంబోలె దేదీప్యమానంబులై యుండు. ఇట్లయిన గృహస్థులు సోమరులై నిద్రాళువులై యుందురో యను శంక వొడమునేమో? అట్లెంచుటకుశంక. చదువులు, సంగీతములు, బిడ్డలకు విద్యలనేర్పుట, కుట్టుపని, వస్త్రాలంకారరచన ఇత్యాది నాగరక ప్రచారము లు వేనవేలున్నవి. వానినెల్ల బహుశ్రద్ధతోనభ్యసించి జన్మమును సార్థకముగను సముల్లాస శోభితముగను నొనర్చుట లేశ కార్యమా? యోచింపుడు!

"అవునుగాని సంబారములన్నింటినిం గొనవలయునన్న సెలవెక్కువయగుంగాదె! ఈ దుర్ఘట కార్యమును వారెట్లు సాధింతురు? మాపురుషులు నట్టిసత్త్వసంపన్నులయినచో మాకీ నిరంతర కాయకష్టము లేకపోవునుగదా! అట్టి నాగరకతనునేర్చి వారివలె కళగా నుండునంతటిభాగ్యము మాకీజన్మమున రాజాలునా!" యని స్త్రీలు ముఖమును చిన్నజేసికొని ప్రశ్నింతురుకాబోలు! సమాధాన మిదిగో!:-

మనమే యన్నివస్తువుల రచించుటకన్న శక్తియుక్తులకు దీటగు మాడ్కి నేదైన నొక్కదానిలో కొన్నింటినో యమితముగ బ్రోగు చేసితిమేని మనకైమిగిలిన రాసులనమ్మి ఇతరముల గొనవచ్చుననుట యేమిచోద్యము? ఇంగ్లీషువారి వర్తనలరీతి యిదియే. ఏకవృత్తిలో బ్రవేశించి వాణిజ్యమూలమున సర్వసామగ్రుల బడయుదురు. మనము నమ్మకముచెడినవారి గుంపులోనుండుట, జాతిభేదములు, దూరదృష్టిలేమి ఇత్యాది వ్యసనమ్ములు కతమ్ములుగ భిన్నులమై సమూహములో నుండియు నొంటరులెన యడవిమనుష్యులట్లు వర్తింపవలసినవారమైతిమి. పరివర్తన పారీణతయుండెనేని సంఘమంతయు బ్రతివానికిని