పుట:Bhaarata arthashaastramu (1958).pdf/272

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నామెను సాగనంపుట కెత్తబడిన గెరిగెను ఇంకొకయూరి యెల్లలోపల "ఇచటదిగి కడుపాఱ విందు సేయుమమ్మా" అని దింపిరేని, ఇరుపల్లియలవారికిని భారత సంగరమును చీయనిపించునంత వాగ్వాదం రేగి యాకసము బద్దలుసేయును!

మోటుతన మెంత ముదిరినవారికైనను రవంతయేని వర్తకములేని బ్రదుకు మృగములకుంగాని మనుజులకు బ్రాతిగాదుకదా! కావున నిట్టి గ్రామ్యజనులుగూడ పర్వదినంబులను, పండుగపూటలను, ఉత్సవకాలమ్ములను, ఇరుగుపొరుగు జనులు గుమిగూడుదురనియు, అట్లు కూడినను దేవతల కప్రియమాచరించిన తమకు నశుభములు గలుగునను భయంబున, నట్టి తరుణమ్ముల జగడముల కుద్యమింపరనియు, పుణ్యస్థలములలో సంతల నేర్పఱచి తమకు మిగిలిన సరకులనమ్మి కొఱతవడిన వానింగొని సంతుష్టివడయుదురు. భీతిచేత సన్మార్గవర్తులైయుండుట గడుసుజనుల తెఱంగు. అశ్వత్థము పరమపవిత్రమని భావింపబడుటంజేసి యావృక్షము నీడలో గల్లలాడరని యచట విచారణలు జరుపుట ఆచారమయ్యె. జ్ఞానవంతు లీశ్వరుడెల్లప్పుడు నెల్లెడల నున్నాడని యెప్పుడును బొంకరు ధర్మపథాసక్త హృదయులు గాకపోవుటచే మూర్తిమంతములైన బూటకములజూపి మూఢజనుల వెఱపించుట యగత్యమయ్యె. శపధములు, స్వామిపాదములముట్టి ప్రమాణముసేయుట గురుపాదతీర్థమిప్పించుట ఇత్యాది నీచతరక్రియలు వనచరులంబోలిన నరులుండు దేశమ్ములం బ్రవర్తిల్లుట కిదియ నిదానము బుద్ధియు గుణములును వికసిల్లినవారికట్టి యపచారములు దుస్సహములు. అది యట్లుండె

ఇచ్చుట తీయుటయు విశేషించి లేనందున ప్రతికుటుంబము వారును సామగ్రులం దామే యాయతములం జేసికొనవలసిన విధి యేర్పడియె. కాలక్రమమున నీయభ్యాసమువలన, నితరులచే జేయబడువస్తువులువాడుట యాచారములోనికి రామింజేసి, యట్టివి శుచి