పుట:Bhaarata arthashaastramu (1958).pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పాపము! ఇప్పటికిని హిందువులలో బహుళ సంఖ్యాకు లింకను నీగ్రామ్యపద్ధతియందే మునింగియున్నారు. చూడుడు! వచ్చుటకును బోవుటకును సులభముగానున్నచో వాణిజ్యము వఱలును. వాణిజ్యవ్యాప్తిచే దూరస్థలములనుండియైన గోరిన వస్తువుల రప్పించు కొనవచ్చును. అట్లయ్యెనేని ప్రతిగ్రామమందును వడ్రంగి, కమ్మరి, కంసాలి, చాకలి, పురోహితుడు ఉండి తీరవలయునను విధి యక్కఱలేనిదగును. ఈ విధి పూర్వముండెననుట గ్రామనిర్మాణ మెఱిగిన వారికెల్ల దెల్లంబ. కావున దేశము భిన్నమై యరాజకమై అల్ల కల్లోలములుగనుండిన కాలమున మనగ్రామములును, వైవాహికాద్యాచార పద్ధతులును నేర్పడినవని పల్కుటయొప్పుగాని, ఇవిదేవతలు, ఋషులు వీరిచే నుత్కృష్టతమములని నిర్ధరింపబడినవనుట పుక్కిటి పురాణము. ఆకాలమున నింతకన్న మేలైన నిర్మాణ మసాధ్యము. అది నెపముగ నిక నేకాలమునకును నింతకన్న మిన్నయగు నిర్మాణ మసాధ్యమనుట కేవలము మూఢత్వము.

హిందువులలో నీప్రాచీన గ్రామ్యపద్ధతి యింకను యౌవన దశయందే యున్నదిగాన మనకు దాని స్థితిగతుల నెఱుంగుట యావశ్యకము అందునకు దగినంత సుగమమును.

నవనాగరకతావాసన గాలిదాటుననైన నెన్నడును సోకని కుగ్రామము నొకదానిని వర్ణింతము. ఊరివాకిలియొద్ద నడుగువెట్టగానే, మిత్రులకు సంతోషమును, శత్రులకు తస్కరులకు (ముఖ్యముగా వారిపాదములకు) భయము నొసంగునదియై, చూచినవెంటనే మేనుల గ్రుచ్చునో యనునట్లుండు కఱకుముండ్లతోవెలయు నాగదాడికంచె యొకటి మున్ముంద అభేద్యప్రాకారంబై కనులపండువు సేయును. ఊరివారు సోమరిపోతులుగాన ముఖద్వారముగుండ రాకపోకలుచేసిన చుట్టుగదాయని తమతమ యిండ్లసమీపమున వెలుగును బడగొట్టి తప్పుద్రోవలజేసి ప్రాకారముయొక్క ముఖ్యోద్దేశమును