పుట:Bhaarata arthashaastramu (1958).pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సులభముగా మార్చుకొనుటకు సాధనమగు నాణెములను నియమించి చెలగు ప్రభుత్వములును అర్థశాస్త్రమునందు పాత్రములు.

సిద్ధాంతములు

ఈ పాత్రములకుగల పరస్పర సంబంధములను ప్రదర్శించుటయే అర్థశాస్త్రపు బని. వీనిలో ముఖ్యము మనస్సుగల నరుడగుటవలనను మనస్సుయొక్క తత్త్వము ఇదమిద్ధమని ఎప్పుడును నిర్ణయింప రానందునను ఈ అర్థశాస్త్ర సిద్ధాంతములలో గొన్ని ఆయా సందర్భములనుబట్టి నిర్ణయించుకొనవలసినవి యుండును.

ఉత్పత్తి

బ్రహ్మ సృష్టించునట్లు మనము క్రొత్తసామగ్రులను సృజించుటలేదు. మన చేయునదెల్లయు ఏమన ప్రకృతిలోనుండు వస్తువులనుగొని స్థలరూపములనుమార్చి సామగ్రు లొనర్చుకొందుము. ఉ. విత్తులను, ఎరువును, నీటినిచేర్చి వరిని సంపాదింతుము ప్రత్తిని పనిచేసి వస్త్రములుగ మార్చుకొనెదము. ఇట్లగుట ఉత్పత్తికి మూలాధారములు మనముచేయుపని. ప్రకృతి అనగా భూమి మొదలుగాగల స్వభావసిద్ధ నిర్మాణములు. అయిన మనము పనిచేయవలయుననిన ఇచ్చమాత్రమున పనిగాదు మనకు తదర్థమయి పెట్టుబడి భోజానాదుల రూపమునను కర్మాగారాదుల రూపమునను అవసరము. ఈ పెట్టుబడినే అర్థశాస్త్రమున మూలధనము. వుంజీ అను నామములచే వ్యవహరింతుము అప్పటికప్పుడు వ్యయమయిపోవు భోజానాదులవంటి మూలధనము చలము. కర్మాగారములవలె బహుకాల ముపయోగపడు మూలధనము స్థిరము అనబడుచున్నవి. మూలధనము మొదట ఎట్లు ఏర్పడె ననుటను గుఱించి మనము తర్కింప నిట నవసరములేదు. కాని ఒక్క విషయముమాత్రము చెప్పనగు. మూలధనమును, బుద్దియు రెండునుచేరి ఆర్థికలోకమునందలి అతికరినావస్థల నన్నిటిని బుట్టించినవి.

విభజనము - ఉపభోగము

ఉత్పత్తికి మూలాధారములగు ప్రకృతి, [1] పని, మూలధనము ఇవి మూటికిని ఉత్పత్తియందు భాగము కలదని వేరె చెప్పబనిలేదు.

దేశమును ఉత్పాతములనుండి రక్షించియు ఇతరవిధములను ఉత్పత్తుల సృష్టికి తోడ్పడుచుండు ప్రభుత్వములకును ఉత్పత్తియందు భాగముకలదు. ప్రకృతి, శ్రమ, మూలధనము, ప్రభుత్వము వీనికి ఉత్పత్తులందుగల భాగములకు వరుసగ గుత్త, కూలి, వడ్డి, పన్ను అను పేళ్ళు.

వినిమయము

ఆశలు మిక్కిలి పరిమితములయి ఉత్పత్తులసంఖ్యయు స్వల్పమయి వ్యవహారాదులు ప్రబలకయుండు అనాగరిక సంఘములయందు ఉత్పత్తిని పంచుకొనుట

  1. దీనినే అర్థశాస్త్రమున 'శ్రమ' యందుము.