పుట:Bhaarata arthashaastramu (1958).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. స్త్రీలు, బాలురు:-

వీరల నపాయకరములైన యంత్రక్రియలలో జొనుపుట గొప్పనేరము.

8. విరామము:-

1. ఆరుగంటల కొకపర్యాయమైన నరగంట విరామమిచ్చుట తగవు. విశ్రాంతి కాలములో సర్వవ్యాపారములకును విశ్రాంతికల్పితము. 2. వారమునకు ఆదివారమునాడో, మఱియేదైన నొకదినముననో ప్రతివానికిని రజా యియ్యవలయు. ప్రతిదినము నేకవిధగతినే ఆటనక పాటనక పాటునకుంజొచ్చిన నెట్టివాడైనను జుఱుకుతఱిగి మొద్దువారుట స్వభావం. ఉచితపరిశ్రాంతి నొసంగుట దేహమునకు మనసునకును బదునుపెట్టినట్లు.

9. బాల్యోద్యోగము:-

1. బాల్యమనగా పదునాల్గేడులకు దక్కువయైన వయసు. 2. తొమ్మిదేండ్లు నిండని వారికి ఫ్యాక్టొరీలలో బనియియ్యరాదు. వయసునిండియుండిరిపో, అప్పటికిని వైద్యుల యనుమతిలేనిది కర్మలకుం దార్చుట న్యాయవిరుద్ధము. 3. ఉదయము 5 1/2 గంటలకు ముందుగ గాని సాయంకాలము 7 గంటలకన్న మించికాని వారిని పనులనుంచుట తప్పు. 4. మఱియు దినమునకు వారు కష్టించు గంటలపరిమితి 7 నకన్న నెక్కువకు బోగూడదు.

10. స్త్రీజనోద్యోగము:-

1. ఉదయము 5 1/2 గంటలకైన ముందుగగాని, సాయంకాలము 7 గంటలకన్న మించికాని వారిని పనులనుంచుటతప్పు. 2. మరియు దినమునకు వారు కష్టించు గంటల పరిమితి 11 నకన్న నెక్కువకు బోగూడదు.

ప్రతిశాలయందును బాలుల వయస్సు. వారికింగట్టబడిన పనులయొక్క స్వభావము మొదలగు వివరముల దెలుపు జాబితాయొకటి నుంచుటయు నీనియములలో నొకటి.

ఇంగ్లాండు మొదలగు పశ్చిమరాజ్యములలో ఫ్యాక్టొరీల వ్యాపారములం గూర్చిన సమయము లింతకన్న నెన్నియో మడుంగులు కఠినతరములు. కొన్నిచోట్ల నెదిగినవారి సయితము 9 గంటలకన్న నెక్కువకాలము శ్రమింపనీరు: ఇట్లు శ్రమకు పరిపరివిధముల పరిమితు లేర్పఱుపబడి యున్నను, ఈ యాశ్చర్య మేమిచెప్ప: ఉత్పత్తి కొఱతపడినది గాదు. దీనికిం గతంబు లెవ్వియని యందురో, చూడుడు:

1. 'ఆత్రగానికి బుద్ధిమట్టు' అనుట వినియున్నారుగదా: అట్లే యమితశ్రమయు నిష్ప్రయోజనము.

2. ఆధునికకళలలో నొకయజమానులయందేకాదు, భృత్యులయందును బుద్ధిబలము, నిర్వికల్పమైన గమనము ఇత్యాది మనస్సంబంధములైన లక్షణములు ముఖ్యములు. అరమోడ్పు గన్నులతో గాయమును శ్రమింపజేసినను జేయనగునుగాని, మనస్సును దీటు కొల్పుట సాధ్యమా? కావున యుక్తమైన విరామము లాభదాయకము. అదిలేనిచో మనసు ముడుచుకొనిపోవును. మనసులేనిపని ఈకాలపు బెండ్లిండ్లుబలె సుమనస్సులకు నరుచ్యము. అసహ్యము, అభివృద్ధి విఘాతుకము: