పుట:Bhaarata arthashaastramu (1958).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విఱ్ఱవీగి పలుకుటగలదు. తమసొత్తునకు దమకును బలాత్కార వియోగము గలుగదను నమ్మక ముండిన, నింతధారాళముగ నిచ్చు నభ్యాసము ద్విజుల బోధనలచే మాత్రము పట్టువడియుండు ననుట సంధిగ్ధము.

ఈకారణములచే సమర్థతయొక తీరుననుండక క్షయవృద్ధులకు బాత్రంబైయుండు. ఇండియావారు సత్త్వంబున నాంగ్లేయులకు సదృశ్యులుగారు. దృష్టాంతము.

ఈ దేశములో సరాసరికి ప్రతికూలివాడును ఉత్పత్తిజేయు సీమబొగ్గుతూనిక 75 టన్నులు. తక్కిన బ్రిటిష్‌రాజ్యములలో సరాసరి కొలత 285 టన్నులు. అనగా ప్రతిమనుజుడును మనకన్న నాల్గురెట్లు సమర్థులనుట. స్వదేశీయులు నలుగురు చేయుపనిని వారిలో నొక్కడు చేయును. ఇంగ్లాండులో ప్రతివానికిని సరాసరి దినకూలి ర్పూ 2-8-0. ఇండియాలో 0-4-0 మొదలు 0-6-0. కూలిలో నమితభేదమున్నను ఈ దేశమున నొకమైలు ఇనుపదారికి ఇంగ్లాండులో నొకమైలునకగు సెలవేపట్టును. తక్కువయేల కాదనగా ఇక్కడ నెక్కువ పనివారని బ్రోగుచేయవలయును. రెండవది. ఈ పనివారు పాటుపడునట్టు తనికీచేయుటకై విచారణకర్తల నియమింపవలయు. ఈ విచారణకర్తలు విచారించెదరా లేదాయని పైవిచారణకర్త లుండవలయును. ఈరీతుల గూలితక్కువయైనను సెలవు తక్కువయగుట లేదు. మనవారిలో నమ్మకము గ్రమము మెఱయ గడంకం గొనిరేని ఇక్కడంత సరసముగ నైరోపాలో సరకులు రచితములుగావు. విదేశవస్తువుల దిగుమతియు నవసరముండదు.

పోల్చిచూచిన నుద్యమములలోనగు మొత్తపుసెలవులో తనికీ విషయమైన వ్రయ మీదేశమున నైరోపాకన్న నధికము. తనికీ నేల చేయవలయునన పనివారు మాటప్రకారము కర్మలను స్వేచ్ఛగా జేయరు. ఈ నికృష్టత యరాజకము మొదలగు వానిచే గలిగిన