పుట:Bhaarata arthashaastramu (1958).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధికిదెచ్చును. కావుననే పోరంబోకు నేలలనిచ్చి పంచములను సాహసవంతుల జేయవలయునని దేశోపకారకజను లర్థించుట.

7. దుశ్శాసన దురాచారములు వితరణకు బాధకములు. దురాచారము లుత్సాహభంగముంజేసి జనులకు సోమరితనమును దుర్వ్రయబుద్ధిని బొందజేయుననుట విశదంబు. అన్యాయరాజశాసనం లటువంటివి. మితిమీఱిన పన్నుల రాజులు విధింతురేని ప్రోగుచేయ నెవ్వరికిని బుద్ధివొడమదు. "సర్పంబు పడగనీడను, గప్పవసించెడు విధంబుగదరా సుమతీ" యనునట్లు లోభుల యాశ్రయమున గరికయైన బచ్చగనుండదు. ఇంగ్లీషువారిచే బరిపాలితమగు 'ఐర్లండు' అను దీవి యొండుగలదు. అందు దుశ్శాసనములు పూర్వకాలమున బ్రబలియుంటచే, జనులు, ఆర్జించినను శేషించునను నాశలేదమి, మనజను లట్లు అప్రయోజకులైరి. ఆ ద్వీపనివాసులు అసంఖ్యజనులు రక్షాకరములైన ఇతర రాజ్యములకు వలసబోయినవారు ఉద్యోగోల్లాస వితరణంబుల ననన్యసామాన్యులని పేరువడసిరి.

బ్రిటిష్‌వారి పరిపాలనకు బూర్వం హిందూదేశం సౌరాజ్యం గలదియై యుండలేదు. తురకలు, మహారాష్ట్రులు చేసిన దౌర్జన్యమును వేఱుగ జెప్పనేల? తత్పూర్వమందును అనగా మనవారు కృతయుగమని కొనియాడుకాలమునందును జనసమూహముయొక్క క్షేమమును మనరాజులు పాలించినట్లు గానము. అల్పసంఖ్యులైన బ్రాహ్మణ క్షత్రియులకుదక్క తదితరులకు సర్వమును వమ్ముగాజేసి జీవనము దుస్సహముగాజేసి యలయించిరి. మఱియు నితరదేశములలో సంఘాచారములువేఱు. రాజశాసనములువేఱు. ఈ భిన్నత బ్రిటిష్ వారి కారుణికత్వమున మనలో నిప్పుడు గానబడుచున్నది. దృష్టాంతము. సంఘధర్మప్రకారము అంత్యజులు ద్విజులతో బోగూడదని యున్నను ప్రజలెల్లరు శక్త్యనుసారము సమముగ బన్నులిచ్చువారు గావున ఇట్టిభేదముల రాజులు గణింపరాదని న్యాయస్థానములు,