పుట:Bhaarata arthashaastramu (1958).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. ఎట్టికుశలుడైనను తనకు లాభము మంచిపదవియు రాదను నిశ్చయమున్న ననురాగముతో శ్రమింపడు. నిష్ప్రయోజన కార్యాసక్తి మృగ్యంబు.

హిందువులలో వర్ణభేదము లనర్థహేతువులు ఎట్లన ఉత్తమ కులజులు ఎల్లభంగులం బూజ్యులకాన వారికి సత్ర్పవర్తనయున్న లేకున్న నొక్కటే. కావున లేకయ యుందమని వారు నుదాసీనులై యుండుట. ఈవిషయము పురోహితులు మఠాధిపతులు దేవార్చకులు మొదలగువారిచర్యలు చూచినవారికి వేద్యము. ధర్మాపేతులయ్యు ద్విజులు పూజనీయులుగనుండుట కీమూఢభక్తియేమూలము. పూర్వం యథార్థధర్మము ననుసరించి వర్ణము లేర్పడకుండినను వర్ణముల ననుసరించిన కృత్రిమ ధర్మంబైనను అనుష్ఠానములోనుండె . నేడీమాత్రపు ధర్మమైనలేదు. ఒక బహిరంగ వివాహములందక్క నింకెందును వర్ణ ధర్మములు ప్రవర్తిల్లకుండుట యెల్లరకుం దెల్లంబ. చర్యానుగుణములైన గౌరవములు జరుగు దేశములో నామమాత్ర వర్ణము లొక్కనాడైననిల్వవు. "నడువడి యెట్లున్ననేమి; వారిపాపముల వారు పోదురు. పెద్దలు సకారణముగ జూపిన మర్యాదలను మనము నిష్కారణముగజూపి పుణ్యము మూటగట్టుదుము" అని తలపోయు మౌఢ్యాత్మకంబైన సమూహం బౌటంబట్టి వేషములకుండు గారవము నడవడికి లేకపోయె. ఇక హీనకులస్థులన్ననో ఎంతతపస్సుజేసినను వారికీజన్మమున భద్రములులేవు గాన వారును శత్రుప్రాయులైన నితరవర్ణస్థులకైన యేల పాటుపడవలయునని యజాగ్రత్తగానున్నారు. కావున నిరుదెఱుగులవారికిని క్షీణతాప్రాప్తికి వర్ణభేదములు ముఖ్యకారణములు.

మఱియు శాస్త్రఘోష లెట్లున్ననేమి? పదవులు ధనము ననుసరించి లౌకికరీతిని వర్తిల్లును. కష్టములకుదగిన ఫలము లేనిచో కార్యంబులయెడ గాంక్షచెడును. మనదేశములో నీవిషయములైన దురాచారములు పెక్కులుగలవు. పనియొక్క కఠినతను గుణమును