పుట:Bhaarata arthashaastramu (1958).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుంటబట్టి విస్తృతముగను గూరతోటలతో బచ్చగను ఉన్నవి. కోకో ఫ్యాక్టరీసేవకులకుదప్ప ఇతరులకు వీనిని బాడుగ కిచ్చుటలేదు. ఇతరులకు అద్దెకియ్యమని యొడంబడిక జేసినగాని శిల్పులకుసైత మందు బ్రవేశములేదు. అట్లగుటచేత నాశిల్పులు నివాససౌఖ్యము దామే తప్పక స్వీకరింతురు త్రాగుబోతు తనముచే ననారోగ్య వ్యయములకుం బాత్రులౌదురను శంకచే నాయూర మదిరాశాల లుండగూడదని నిబంధనయుంగలదు. వీనికి మాఱుమత్తు నియ్యని భోజ్యపదార్థముల విక్రయించు నంగడులున్నవి. ఈ స్థలములు జనుల నాకర్షించుటకునై బహుచిత్రముగ గట్టబడినవేగాక లోన మంచి కుర్చీలు, సోఫాలు, మేజాలును గలిగి ప్రతిమలచే నలంకృతమై 'బిలియర్డ్స్‌' మొదలగు క్రీడలకును వసతులుకలిగి తేజరిల్లెడు. కర్మకరులు గుమిగూడి సభజేయుటకొక మంటపమును చదువుటకు బుస్తకభండారమును చికిత్సార్థము వైద్యశాలయు చెండ్లాడుటకు విశాలమైన భూములుగలిగి 'బోలిన్‌విల్లు' విరాజిల్లుచున్నది. ఈగ్రామాధికారము యజమానులును భృత్యుల ప్రతినిధులును గలిసిన పంచాయతిదారుల వశముననున్నది.

లక్షలకొలది సెలవుజేసి కాడ్‌బరీ లట్లేలచేసిరి? నష్టముగాదా? యనిన వారు ధర్మార్థమేగాక కర్మార్ధము నియ్యది ప్రతిష్ఠించి రనవచ్చును. ఎట్లన నిశ్చితావాసములు ఆరోగ్యముగల యధీనులుండుట వల్ల పనినిలువక నికరముగ గడియారమువలె నడచుటచే వారికి లాభమెక్కువ. మఱి యుల్లాసముతో బాటుపడుదురు గావున నచ్చులేక పని త్వరత్వరలో ముగింపవచ్చును. పసందుగాను ఉండును. పనివారు కపటవేషములకుం గడంగిన నష్ట మింతంతయని చెప్పితీరదు. బొంబాయిలో దినమునకు సరాసరి 1000 మంది రావలసినచో 1200 మందిని సేవకు గుదుర్చుకొనకున్న సాగదు. అనగా దినమునకు రమారమి 200 మంది మిషజెప్పియో చెప్పకయో మఱుగౌచున్నారనుట.