పుట:Bhaarata arthashaastramu (1958).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘమునకును మనకునుగల సంబంధము చందందెలియనివా రగుటచే హిందువులు నిక్కంపు టహితములను హితములనినమ్మిచెడిరి. దేశసంఘము శరీరము. వృత్తులు అవయవములు. ప్రజలు రుధిరవ సాధులవంటివారు దేహము ప్రధానము. రుధిరాదులు పరిచారికములు. దేహారోగ్యము కార్యము. పెఱవాని బ్రదుకు లుపకరణములు. దేహమునకై యవయవచ్ఛేదము జేతురుగాని యవయవమునకై దేహము నెవ్వరును ఖండింపరు. అంగములు కొన్ని చెడినను మొత్తముమీద గాయము సురక్షితమైయుండుట గలదు. కాని యొడలెల్ల నశించెనేని ముక్కుమోములు గాననగునా? కావున నంగముల ధర్మము శరీర సౌఖ్యము ననుకరించుటయ గుణము. పేరాసచే బొలివోయిన జ్ఞానము గలవారై హిందువు లీన్యాయము నుల్లంగించి వర్ణములు దేశసంఘమున కంగము లట్లుండవలయుననుట విడనాడిరి. అగ్రజాతులవారు స్వప్రయోజనముపొంటె "రాజ్యముయొక్క ముఖ్యోద్దేశము వర్ణధర్మములం బ్రతిపాదించుటయ" యని చాటించి పుణ్యము గట్టుకొనిరి. ఇది యెట్లున్నదనగా తలయొక్క ముఖ్యకర్మము పడిసెమును భద్రముగ గాపాడుకొనుట యనునట్లు వర్ణములు దేశప్రయోజనమునకు లోనైయుండిన రెండును నేటిరీతి బరిహాసపాత్రములై యుండవు.

ఈశరీరాంగసామ్యముచే నింకను ఒక యాక్షేపమునకు బ్రతియియ్యవచ్చును. "మనపూర్వులుచేసిన సుకృత దుష్కృతములు మనలో గానుపించునని యంటిరే. ఎవరో చేసిన దానిచే నేదోషము నెఱుగని మనము వెతలగుడుచుట న్యాయవిరుద్ధముగదా!" అని యడుగువారికి సమాధానములు. దేశసంఘము శరీరము. సఖ కశముల వల ప్రజలు వచ్చుచు బోవుచుండినను అయ్యది శాశ్వతంబైవుండు. కాన కార్యములన్నియు మనమూలకముగ సంఘముచేత జేయబడునవియని యనవచ్చుగాన సంఘకర్మ సంఘమునేజెందుట యాశ్చర్యం