పుట:Bhaarata arthashaastramu (1958).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నింకను శ్రద్ధతో జేయుచు గన్నులల్లార్చుచు నోరుదెఱిచికొనియుండుటంజూడ నెంత చిత్రముగనున్నది జపానువారి పదవికి రావలయునన్న వారిపద్ధతులం బూనవలయును, కడకలేక కార్యము లడరవు. ఉంఛవృత్తి, అవిభక్త కుటుంబములుగల దేశములలో కష్టపడకయ ఫలము లందజూచుట యనేకులకు సహజగుణము. సహజగుణమేగాని సాధనకు జాలిన గుణముగాదు. ఆంగ్లేయులవలె బరదేశంబుల దయాదాక్షిణ్యములతో బాలించిన ప్రభువులెవ్వరునులేరు. వారిచే తత్తములైన విద్యలును మనకు ప్రత్యక్షముగ వారియందే ప్రకటితములగు సంఘధర్మములును ఈదేశమున చవిటినేలలోని విత్తనముంబలె నంకురింపక పోవుటజూడ విస్మయ విషాదంబు లుల్లంబుం గలంచెడిని. చెన్నపురి రాజధానివారికన్న బంగాళా, బొంబాయి, పంజాబు మొదలగు సీమలవా రెక్కుడుగ జొరవజూపెదరు. ముఖ్యముగ బంగాళా వారు పౌరుషమే ప్రధానమనుటకు నిదర్శనముం జూపించు వారలు. పదేండ్లక్రింద బంగాళీలన్న "పిఱికిపందలు. కడుపు గదలింపనేరని సోమరిపోతులు; పుస్తకముల గ్రుడ్డిపాఠముజేసి పరీక్షలందు గడదేరుట తప్ప నింకెందునకుం దరముగానివారు!" అని యెల్లరు హేళనము జేయుచుండెడివారు. ఇపుడీరీతివారి నెవరు గర్హింపుదురు? పౌరుష ప్రకటనమే ముమ్మాటికిని సర్వసమ్మానావహంబు.

కావున "జాతిచే దిక్కులేని హీనుడను" అని తలంచి యెవ్వరు నధైర్యపడగూడదు. పుట్టుకకన్నను తలవ్రాతకన్నను శిక్ష(తరిబీతు) అధికశక్తిమంతము. అల్పములైన ప్రయోజనములు, ధర్మములు, గౌరవములు, యోగ్యతలుకలిగి కొన్నిమర్యాదలు జరుగుచుండినను మానవంతులు సమానస్థాన భావములేనిది విరమితయత్నలుగాఠు.

       "తనిసిరే వేల్పులుదధి రత్నములచేత?
        వెఱచిరే ఘోరకాకోల విషముచేత?
        విడిచిరే యత్నమమృతంబు వొడముదనుక?
        నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు." - భర్తృహరి.

జాతిచే సంబంధించిన తక్కువలు సంస్కారమున కధీనములుగావు.