పుట:Bhaarata arthashaastramu (1958).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మంబులు వివిధము లనుటకు గృహస్థధర్మము, వర్ణధర్మము, కులధర్మము, దేశధర్మము ఇవి మొదలగునవి.

ఇందులో ననుష్ఠేయములెవ్వి! ఈసందేహమును జపానీయుల చరిత్రయు దానిచే వారు సంపాదించిన యౌన్నత్యమును బొత్తిగ బరిహరించినవి. వారిమతము సర్వజనాదేయము. అదేదన:- కులము, వర్ణము మతము ఇత్యాదులు దేశసంఘముల నాశ్రయించి బ్రదుకునవి గాని ప్రత్యేకముగ బ్రసిద్ధికివచ్చు స్వతంత్రశక్తియుతములుగావు. దేశీయమహావృక్షము తావలముగబెఱుగు బదనికలవంటివి. ఎట్లన దేశము క్షయంబునొందుడు నివియును పేదవడును. తురుష్కుల రాజ్యకాలములో నీదేశములో హిందువుల మతాచారములకును గుడి గోపురములకును గలిగిన క్షోభ జ్ఞప్తికి దేవలసినదిలేదు. కావున మతాదు లెంతమంచివైనను అపౌరుషేయుములైనను, జనులను పౌరుషరహితులం జేసియు నైకమత్యంబు విథారించియు రాష్ట్రము నేలకుందెచ్చిన తుదకు నవియును అడుగంటుననుట విస్పష్టముగాన బెనువాదమిట బనిలేదు. కావున సర్వార్థములకు నాద్యంబైన దేశీయశోభనమే పరమపుణ్యంబు. సంఘధర్మము ఇతరధర్మములకెల్ల శ్రేష్ఠతమము. సంఘాభివృద్ధికి బ్రతికూలములైన యనివర్జ్యంబులు. జపానువారు ఈ తత్త్వముల మనమున జక్కగా బాదుకొలిపి కుల, మత, వర్ణాచారంబులలో సంఘాభివృద్ధి మహాకార్యమునకు విఘాతుకములైన ధర్మముల నిర్మూలించి ఒండొరులతోడి పొత్తును నూత్న కళావిన్యాస కౌశలమును వలయునంత యలవరించుకొని ఆంగ్లేయులతో సరిగ సంధిజేసికొను నంత ప్రాభవము వడసిరి.

అదిచూచి మనవారు కొందఱు, మనకు నొకానొకనాడు ఇట్లే ధ్యానము జేసికొనుచుండినవారివలె సంఘముగానుండు విభవము ఘటిల్లునని వెఱ్ఱియాసనొకటి నిల్పుకొని, కృత్రిమతృప్తివడసి, సుకృతములజేయని పాపముచాలక పూర్వాచారములనబడు దుష్కృతముల