పుట:Bhaarata arthashaastramu (1958).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ యాదిజన్మమునందైన మనము స్వతంత్రులమైయుండుట యొప్పుకోవలసిన పలుకుగదా! ఇది యొప్పుకొన్న దాముజేసిన సిద్ధాంతములకెల్ల భంగము వాటిల్లునని కాబోలు వేదాంతవాదులు కర్మమనాదియని వాక్రుచ్చిరి. అనగా కర్మము పుట్టినకాలము నిరూపించ సాధ్యముగాదనుట. నిష్కృష్టార్థ మేమన జగత్సృష్టిమొదలు కర్మము జనులవెంట బిశాచమువలె నంటుకొనియుండునని! ఇది యెంత సమంజసముగనున్నదో చూడుడు! కర్మము స్వతంత్రమా లేక ఆచరణజనితమా? ఎవడైన నొకడాచరింపనిది కర్మము తనంతట బుట్టునా? ఒకవేళ సృష్ట్యాదినుండియే కర్మ మనువర్తించుచున్నదని యొప్పుకొందము. అప్పుడుగూడ నరుడు స్వాతంత్ర్యము వహించియే కర్మము నాచరించి యుండవలయుగదా! కావున నామూలాగ్రముగ తత్వపరిశోధనముజేసిన సర్వమును స్వతంత్రవర్తనచే నిర్ణీతముగాని పారతంత్ర్య ప్రసిద్ధముగాదనుట నిక్కువమగు.

స్వతంత్రత యుండెననుకొందుము. అయ్యది యొకజన్మమున జేసిన కృత్యములచేబద్ధమై కాలాంతరము పర్యంతమును కదలక మెదలక యుండుననుట సమ్మతింపదగినమాటకాదు. ఆస్వాతంత్ర్యమే మఱల మఱల సవరించుకొని యుత్తమస్థితికి రానేల యుద్యమింప గూడదు? కాలుజారి క్రిందబడినవాడు "ఇది నాకర్మము. మఱల లేవగూడదు" అని యట్లే పడియుండగలడా?

మఱియు నాగుణములు చరితములన్నియు గర్మాధీనములండ్రు. అట్లేని స్వేచ్ఛావర్తన మున్నదనుటయు నది కర్మబద్ధంబుగాదనుటయు గర్మాధీనములేయగును. ఇది స్వరూపా సిద్ధముగదా?

మఱియొకటి. స్వతంత్రతయే లేనిపక్షమున "ఇది తగును, అది తగదు; ఇటుజేయుము, అటుజేయుము" అని ధర్మశాస్త్రములను విధించుట పొసగనిమాట. స్వతంత్రతలేని స్థావరమగు వృక్ష










`అ