పుట:Bhaarata arthashaastramu (1958).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున ప్రపంచమునంగల ఆంగ్లేయాదిరాజ్యంబులతో ననుకరింప గోరిన నాహవములకువలయు ధనబాహుళ్యముండుట యావశ్యకము. అట్టిధనములు ఆధునిక విధంబుల వివిధంబులగు కళల నభివృద్ధి చేసినం గాని పడయబడవు. సంప్రదాయమే సర్వశ్రేష్ఠం బనువారికి నధమత్వ విమోచనంబుకానిపని. అట్లగుటచే జపానీయులు నవనాగరికతయే ప్రాణమానసమాశ్రయంబని ధృఢముగనమ్మి తదుచితరీతి దేశాచారములలో మార్పులంజేసి యంత్రకళలస్థాపించియు, జనులశక్తి కనుగుణములగు వృత్తులం బ్రవేశింపంజేసియు, సంప్రాప్తార్థ పౌష్కల్యులై, రష్యావారి వికలతనొందింప సందు జూచుచుండుతఱికి, ఇంగ్లీషువారు తమకును రష్యావారికిని ద్వేష హేతువులుంటబట్టియు, సముద్ర యుద్ధమున గుశలులైన జపానువారు తమకుగాని వారితోగలిసిన తమకు మంచిది కాదగుటంబట్టియు, వర్ణమతాచార వేషభాషా విరుద్ధులయ్యు జపానువారితో బద్ధసఖ్యులైరి. అపుడు రష్యావారు అరులయంతరువును సంపూర్ణముగ గనుగొన్నవారు కానందున జపానువారు మునుపటి యట్లు తమకు వెనుబడినవారను గర్వంబుతో జిన్నజేయ వారిక వేడిజూపనిది మర్యాదదక్కదని యుక్కుమిగిలి రెండేండ్లయుద్ధములో శత్రువుల భంజించి కృతార్థతయు లోకమాన్యతయుబడసి తమ యాహవదోహలులనుకీర్తిని నలుదెసల నింపిరి. ఇది మనవలెనే తూర్పువారును మతాచారములలో నించుమించు సరిపోలినవారును జూపిన పరాక్రమము. కావున జాత్యాదులకన్న పౌరుష ప్రభావం బెక్కుడు.

జాతిగుణంబులు

మునుపు జీవశాస్త్ర పారంగతులగు కొందఱు జన్మగుణంబుల మార్చుట యసాధ్యమని యభిప్రాయ పడివుండిరి. ఆధునికులు వారితో నేకీభవింపరు. మఱేమన్న పుట్టుకకన్న పెంపకమే ప్రధానమని యేక వాక్యముగా బలికెదరు. బ్రాహ్మణ పుత్రునైనను చిన్ననాడే