పుట:Bhaarata arthashaastramu (1958).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాఱవ ప్రకరణము

కర్మకరుల శక్తియుక్తులు

శ్రమను అతిశయిత సామర్థ్యముంజేయు విధానములు ద్వివిధమ్ములై ప్రవర్తిల్లు.

1. కర్మకరుల దేహమనోదార్ఢ్యంబులు ఆఢ్యంబులై యుండునట్లొనర్చుట.

2. వృత్తులను తగువిధంబులదీర్చి నిర్మించుట.

ఇందు మొదటిదాని ననుసంధించు సమయంబు లెవ్వియనిన:-

పారంపర్యప్రాప్తమగు శరీరబలము

లోకములోని జనులందఱును తుల్యబలులుగారు. నేలలయందుం బలె నరులలోను సారవిషయకములగు నంతరములున్నవి. ఇవి నిర్హేతుక జాయమానములుగాక శీతోష్ణస్థితి, సంఘచర్యలు, చిరకాల పరిచిత కర్మలు, వైవాహికాచారములు ఇత్యాదుల ననుకరించి యుండును. "పుట్టుకతోనే చెడిపోయినారము; ఇక నేమిచేసినను పరిష్కృతుల మగుట దుర్లభము" అని నిరాశులై యుండుట తెలివిమాలినతనము. "పురాకృత కర్మమువలన నాకు నీగుణములు పట్టువడినవి; పుట్టుకతో వచ్చినది పుడకలతోగాని పోదు" అని సాహసరహితులై యుండుట పామరలక్షణము. జననసిద్ధములగు లోపములను పాపములకు పౌరుషమే ప్రాయశ్చిత్తము.

జపానీయుల విజృంభణము

జపానుదేశీయు లేబదియేడులకు బూర్వము మనవలెనే పాశ్చాత్యులన్న భయకంపితులుగ నుండెడివారు. వారిదేశములో మనంబలె జాత్యుపజాతులు వర్ణధర్మంబులనబడు నానావర్ణాధర్మం