పుట:Bhaarata arthashaastramu (1958).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికవృద్ధికి వీలు ఎక్కువగ గుదిరెనేని ఱంపములు, కత్తెరలు, పేనా కత్తులు ఇత్యాది సంస్కృత పదార్థములు సరసములౌననుట స్పష్టము.

సంకేతనామములు

లేత, పచ్చి, అసంస్కృత, అరచిత ఇత్యాదులు తయారుచేయబడని వస్తువులయందును, పక్వ, ముదురు, సంస్కృత, రచిత ఇత్యాదులు తయారుచేయబడిన వస్తువులయందును ప్రయుక్తములు.

హెచ్చఱిక:- ఒకేవస్తువు ఒండుకళలో పక్వమనియు వేఱొంట నపక్వమనియు గణింపబడినను బడవచ్చును. దృష్టాంతము. ప్రత్తి సేద్యగానికి విరచితము. అనగా వాడు దానితో నమ్ముటదప్ప వేఱిమియుజేయడు. గింజలను దూదిని వేఱుపఱిచి బస్తాలుగట్టు ఫ్యాక్టొరీవారికి ప్రత్తి యరచితము ఏలన; వారు దానినింకను బక్వమునకు దెత్తురుగాన వారికి బస్తామూటలు ముదిరినవి.

ఈ మూటలగొని నూలువడకువారికా దూది పచ్చిది. నూలు పాకము

నేతగాండ్రకు నూలు లేత. బట్టలు తరుణములు.

ఉడుపులు జేయువారికి బట్టలు పచ్చి. చొక్కాయీలు మొదలగునవి ముదిరినవి.

ఇట్లే ఇనుము, కొయ్య ఇత్యాదులయందును గ్రహించునది:

కళలలో దయారుచేయ దేబడునవి యపక్వములు. తయారై దింపబడునవి పక్వములు. ముందఱి కళపరముగ జూచిన వస్తువు లసంస్కృతములు; వెనుకటి కళపరముగ జూచిన సంస్కృతములు.

భూమిలోనుండి యుత్పత్తియైనవి వెనుకటి కళలనుండి పుట్టినవి గావుగాన వానిని శుద్ధాసంస్కృతములందురు. నేరుగా వినియోగ్యములైనవి శుద్ధసంస్కృతములు. ఈరెంటికిని మధ్యనుండునవి మిశ్రములు