పుట:Bhaarata arthashaastramu (1958).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈసంశయము నివారించు వ్యాఖ్య:-

వస్త్రముయొక్క వెలలో ప్రత్తియొక్కవెల బహుస్వల్పభాగము. చూడుడు?

వస్త్రరచనోపకరణములు

1. ప్రత్తి.

2. వడకుట.

3. నేతపని

వస్త్రము తాను పదిరూపాయలు జేయునదియైన అందులకు వలయు పచ్చిప్రత్తివెల ఒకరూపాయయుండిననెక్కువ. ఈదంశాంశం మాత్రమే హీనవృద్ధికి జేరినది. ఈయంశము ప్రియమైనను ఎక్కువ సరకు తయారుచేయుటవలన అధికవృద్ధి గతములైన తక్కినభాగములు నయమైనచో మొత్తముమీది వస్త్రముల వెలలుదిగుననుట సుగమము.

నాలుగురూపాయలుజేయు సాధారణమగు నినుపకమ్మి వస్తువులుగా పక్వముచేయబడి ఈ క్రిందిధరలకు నెగయును.

ఇనుపదారికమ్ములు రూ. 6-0-0

గుఱ్ఱపులాడములు రూ. 11-0-0

ఱంపములు రూ. 60-0-0

మేలైన కత్తెరలు రూ. 1800-0-0

తీక్ష్ణములైన పేనాచివ్వుకత్తులు రూ. 2640-0-0

చూచితిరా! నాలుగురూపాయల వెలయిచ్చి అసంస్కృతమగు నునుమును పక్వమునకు దేనుదేను 2640 రూపాయల యనర్ఘసామగ్రి యైనది! ఈరెండువేల చిల్లరరూపాయలలో క్షీణవృద్ధికి లొంగిన భాగము 4 రూపాయలుమాత్రమే. ఈభాగమువెల పదింతలు విజృంభించినను సరకులు సవిస్తరములౌటచేనైన యంత్రసంస్కారముచేనైన