పుట:Bhaarata arthashaastramu (1958).pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అంకితము

ఆత్మగతము

 
        క. అస్మత్ప్రియసఖి-
           సస్మేర ముఖేందు బింబ సమ్యగ్తేజో
           భస్మిత శోకాంధ తమస,
           విస్మయ గుణధామ, మనసు వెడలునె యెపుడున్ ?

        సీ. తనకీర్తి భూనభోంతరముల విరసించి
                     చిఱునవ్వులై తన్నె చేరికొలువ
           దన భావనాప్రభల్ ఘనవీధిగర్జించి
                     కలికిచూడ్కులమెఱుంగులుగ బర్వ
           దన మనోహరతచంద్రజ్యోత్ప్నలకుబోక
                     నడకలసొగసులో నడగియాడ
           దన మార్దవము చిగుళ్ళను బువ్వులనుద్రోచి
                     పలుకులతీపిలో గలసిమెలయ

           నాత్మదేహమ్మునకు దేహమాత్మ కమరి
           నట్లు, సుగుణము లతవార మందినట్లు
           భాసురాకార సుందరవర్తనముల
           గనుల మనసును జొక్కించు కాంత దలతు.

        గీ. నిండు హృదయంబుతో మహోద్దండ వృత్తి
           గాంక్ష వేసిన యది పండు గాక పోయె ;
           గాల మాశను ద్రుంచె : నింకం ద్వరసు ని
           రాశ కాలంబు ద్రుంచిన, నదియ సుఖము.

        గీ. కనులు మూయునంత గలలును, గలలలో
           భవ దుదార మూర్తివచ్చి నిలుచు ;
           గనులు దీర్ఘ నిద్ర గప్పంగ బడిన ని
           న్ననవరతము జూడ నౌనె చెపుమ.

       శా. పోయెన్ గాలము; ప్రాయమున్ గడిచె; నింపుం బెంపులున్ ద్రుంగె; మి
           థ్యాయత్నంబులెకాని మన్మనమునం దత్యంతమౌ మక్కువన్
           బాయంజాలక నిల్పియున్న తమ సాఫల్యత్వముం జెందలే,
           దాయుర్వృద్ధి యికేల నాకు జనరాదావేగ నాప్రాణమా.