పుట:Bhaarata arthashaastramu (1958).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావము మేరమీఱినదిగాకున్న యుక్తమనియు, పురోవృద్ధికి ననుకూలమనియు, నాగరికతాలక్షణ మనియు తొలుత వాంఛావిమర్శ సందర్భమున బ్రకటించితిమి. అది యట్లుండె.

మఱియొకటి. సంకల్పితములైన వ్యవహారములలో నొకదానికి మాత్రము వెలతగ్గిన దానియమ్మకము పెఱుగజాలదు. దృష్టాంతము. ఊరుగాయబానలు మామిడికాయలులేనిది వ్యర్థములు. వానివెల యెంతచులకనైనను మామిడిపంట ననుసరించి ఎక్కువగనో తక్కువగనో యని చేయబడునుగాని ధరలు తేలికయయ్యెగదాయని ఎక్కువగ నెవ్వరును గొనరు.

కావున నయము క్రయము యథాక్రమబద్ధములనుట సరాసరికి సరియైనను విఱుగులులేని న్యాయముకాదు. మఱియు, క్రయములు అధికములై తుట్టతుదకు నూతనములైన యంగళ్ళు స్థాపింపబడు నను కొందము. ఈ స్థాపన తలచినమాత్రాన అయ్యెడుపనిగాదు. కాలాంతరంబునంగాని తక్షణంబు ననపణ్యశాలలు పుట్టుగోగులట్టు బయలు వెడలవు. అట్లగుటచే నిప్పుడు పనిబోగొట్టుకొని పరితాపపడువానికి ఇవియెట్లు శైత్యోపచారములవును? నేడు కూడులేదని వాపోవు బీదలకు ఇంకాఱునెలలకు దివ్యమైన యుద్యోగము తనంతటవచ్చి మీ పాదములం బట్టుకొనునన్న నేమితృప్తి? కాలాంతరము సన్నియత మగునంతలో తమకే యాపనికుదురునని ఏమినిశ్చయము? ట్రాంబండ్లు, జట్కాబండ్లును పరస్పర వైరముననున్న సమయంబున కొందఱికి గీడుమూడకపోదనుట అనివార్య సిద్ధాంతంబని యంటిమి. అయ్యది నిశ్చంచలము.

3. మూలధనము శ్రమకునాలవానము. మూలధనం బభివృద్ధియైన అనగా నుద్యోగముల నెక్కువగ బ్రయోగింపబడిన పనులును ఎక్కువలౌను. పనులెక్కువయైన పనివాండ్రకుమేలు. దీని యాథార్థ్యము నంగీకరించితిరేని యంత్రములు కర్మకరుల కుద్యోగదాయకము