పుట:Bhaarata arthashaastramu (1958).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నైదింటనొకవంతే. నెలకు 5 రూపాయలుతీయువాడు ఒక్కరూపాయ సారాయికిబెట్టి 4 రూపాయలు ప్రాణమాన రక్షణార్థమువేసిన 4/5 వంతు ఆవశ్యకవ్రయముగదా? ధనికుడు ఆదాయములో 100 కి 20, బీదవాడు 100 కి 80 వ వంతులు ఆవశ్యకములకు బెట్టుదురు.

యంత్రములచే నలంకారములుమాత్ర మెక్కువ నయమగును గాన పోల్చిచూచిన ఆఢ్యులంజెందునంత ఫలంబు దీనులం జెందనేరదు.

2. యంత్రములచే నుత్పత్తి హెచ్చుచున్నది. దానిచే వెలలు పడును. వెలలు తగ్గుడు అమ్మకము జాస్తియగును. వాణిజ్య విన్యాసముచే మునుపటికన్న నెక్కువపని వర్తకమున నేర్పడును. కావున యంత్రములచే స్థానభ్రష్టులైనవారు నూతనముగ గల్పింపబడిన ఇతర కార్యములలో బ్రవేశించి ప్రాప్త భరణులు కావచ్చును. కావున యంత్రములచే నేమాత్ర మెవ్వరికిని గష్టముగాదు.

ఈవాదము పూర్వమే ఖండితమయ్యును మఱియు జర్చింతము.

వెలలు క్రుంగుకొలది వాణిజ్యములు పొంగుననుట యమోఘ న్యాయంబుగాదు. కొన్నిటియందు మనయాసక్తి త్వరలో మితిమీఱినదగును. కొన్నిటియందుగాదు. బంగారు నెంతకూడబెట్టినను ఇంకను గూడబెట్టుదమను ఆశవదలదు. కావున నది యెంత సరసమైనను దానిక్రయము విరసముగాదు. మితాసక్తి పాత్రములై నవస్తువు లూరక లభించినను మనమెక్కువగా ప్రోగుజేయగోరము. ఉప్పునయమయ్యె గదాయని హద్దుపద్దులేక నోటిలో నెవ్వడు నిండించును? మొత్తము మీద ఆవశ్యకములమీద యనురక్తి త్వరలో నంతమొందుట స్వాభావికము. అలంకారములయం దంతశీఘ్రముగ నార్పబడదు. భోజనమునకై నూఱురూపాయలు సెలవుజేసిన నిది దుండగముగదా యనివిస్మితులౌవారును, నగలు, కాశీచీరలు, సొగసైనబండ్లు, శృంగారా గారంబులు, ఉద్యానవనములు, ఇత్యా ద్యతిశయిత భోగభాగ్యంబులకై వేలకొలది ధారవోసినను అమితవ్రయమని చింతింపరు ఈమనో