పుట:Bhaarata arthashaastramu (1958).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱియు పూర్వము వివరింపబడినట్లు జనసామాన్యము తమ రాబడిలో ముక్కాలు మువ్వీసముపాలు వినియోగించు భోగ్యములు భోజనము గృహములు గట్టిగుడ్డలు, నివాసాహారముల యుత్పత్తిలో యంత్రము లంతసహాయకారులుగావు. ఇక గుడ్డలన్ననో ఇవి కొంతమట్టునకు నయములైనను సరాసరికి కోమల దుకూల రచనయందుబలె కర్కశ వస్త్ర అనువయమున యంత్రములు ప్రయోజకములుగావు. కాన మోటుగుడ్డలధరలు విశేషము వ్రాలవు.

ఇందుచేత నుద్ధతులతో సమానమైన యుపయుక్తతను పరిహీణులైనవారు యంత్రములవలన బడయజాలరనుట స్పష్టము. ఈ విషయమునే ఇంకను విస్తరించి నుడివెద.

వస్తుసముదాయములు రెండుతెఱంగులుగ విభజింపవచ్చును. ఆవశ్యకములు, అలంకారములు అని.

ఆవశ్యకములు: భోజన నివాసాదులు. అలంకారములు: చీని చీనాంబరంబులు, భర్మహర్మ్యములు, మృష్టాన్నములు, మణిగణ ఖచిత భూషణంబులు మున్నగునవి.

మొత్తముమీద నావశ్యకములు హీనవృద్ధి పాత్రములు. అనగా బండములు విశేషించి యుత్పత్తి జేయవలయునన్న వ్రయము క్రయము హెచ్చును. జనసంఖ్య యెక్కువయగుదు, బాడుగలు, ధాన్యముల ధరలు పనికెగయుచుండుట యనుభవ విదితమే.

అలంకారము లధికవృద్ధిపాత్రములు. అనగా రాశి గురుత్వంబు వహింపుడు వ్రయక్రయములు లఘువులగును. వీనియందుబలె పై వాని యందు యంత్రము లంతతఱుచుగ వాడబడవు.

బీదలును సామాన్యప్రజలును తమయాదాయములో నెక్కువపాలు ఆవశ్యకములవాతవేతురు. మహారాజులైనవారు అలంకారముల కర్పింతురు నెలకు 1000 రూపాయలు వేతనముగ యుద్యోగస్థుడు ప్రాణాధారములకై 200 రూపాయలు సెలవుచేసినను ఆదాయములో