పుట:Bhaarata arthashaastramu (1958).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తళతళలు, గీటులు, ఛాయలు మొదలగువాని యలంకారకరమగు కలయికచే దీర్పబడునవియునైన కళలలో యంత్రములకు బ్రవేశము బొత్తుగాలేదు. శ్రీ శ్రీ అలెగ్ఝాండ్రా మహారాణిగారి పట్టాభిషేక పరిధానములు డిల్లీలో చేతితో నేయబడి బంగారుసరిగె, ముత్యములు, నానావిధ వర్ణ చిత్రములు వీనితో శృంగారింపబడినవి.

కావున యంత్రవ్యాప్తివలన చుఱుకుదనముగలవారి కేనాడును పనికి గఱువుగాదు. తామసగుణ పూరితులైన మందస్వభావులకు యంత్రములుండిననొకటే లేకున్ననొకటే. అట్టివా రెన్నంటికిని ఎన్ని పనులున్నను కృతప్రారంభులుగారు.

సౌఖ్యస్వభావము

ఈ కారణంబులంజేసి యనాయాసస్వర్గము యంత్రములను సోపానప్రాప్తిచే దిగివచ్చి మన కింద్రభోగము సిద్ధింపజేయుననుట పిచ్చిమాటయని వ్యక్తీకరింపబడియె. దేవేంద్రభోగము రాదుగదాయని బుద్ధిశాలి ఎవ్వడునుజింతింపడు. ఎందునకన, ఒక్కపనిపాటును లేక యూరక కూర్చుండిన నెట్టిభోగములును మనకు రుచింపవు. కష్టపడిననేగాని సుఖము సుఖముగ దోపదు. మఱియు సౌఖ్యమునాశించి యద్దానినే అన్వేషించిన నీడయుంబోలె నది మనము వెనుదగులు కొలది ఇంకను ముందునకు బోవుచుండునేగాని చేజిక్కదు. సౌఖ్యము తన్నేగోరి వచ్చువారి నిరసించును. అట్లుగాక కార్యసాధన కృతావధానులై చింత లేక తమ పనుల జాడలంబట్టి పోవువారిని వలదన్నను వెన్నాడి కలయజూచును. ఇది సౌఖ్య స్వభావము. నాకుం జూడ పురుషార్థములు పెక్కు లిటువంటివ యని స్ఫురించెడివి. ప్రొద్దస్తమానము 'నాకు దేహము ఆరోగ్యముగా నున్నదా లేదా' యని నాడి నిమిష నిమిషమునకును బరిశీలించి చూచువానికి ఆరోగ్యము నిలుచునా? ఆ యారోగ్య చింతయే యొక రోగము. చక్కగా చల్దిగుడిచి నాగేలి భుజముపై నుంఛుకొని పొలముల బుద్ధి నిలిపి తన్ను దామఱచువాడు ఆరోగ్యవంతుడుగ నుండుటయే