పుట:Bhaarata arthashaastramu (1958).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శీఘ్రకాలమున నీక్రొత్తపనిని నేర్చుకొనగలడు. కావున లాభ మెక్కడ నెక్కువగనుండునో అందుదిగుటకు హస్తకళలకన్న యంత్రకళలలో నెక్కువవీలున్నది. అనగా జనులు జాతిమతాచారబద్ధులు గాక విచ్చలవిడి సంచరించు దేశములోనను సమయమూహ్యంబు.

యంత్రములకు బ్రవేశములేని వృత్తులు

ఈ వ్యాఖ్యానముజూచి కొందఱు కాలక్రమమున యంత్రములు సమస్తవ్యాపారముల నాక్రమించుకొనునేమో చేతులు జేయను పనులేమియులేక నానాటికి జీర్ణములై నిస్సారములై పోవునేమో! అని శంకింతురేమో? అట్లు శంకింప నక్కఱగానము. ఐహికంబుల కన్నింటికింబలె యంత్రశక్తికిని మేరలున్నవి. అది యపారంబుగాదు. అనేకక్రియలు హస్తసాధ్యములుగాని యంత్రసాధ్యములుగావు. అవి యేవనిన:-

యంత్రము లేకవిధమైన గమనముచే కార్యము జేయును. దూదికర్మశాలలో నూలువడకు యంత్రముల జూడుడు! అవి యొకే తీరున నొకేవేగముగ తిరుగునుగాని స్వచ్ఛందగమనశక్తిగలిగి మన యట్లు వంకరటొంకరగ నానావిధగతుల జరింపజాలవు. రైల్‌ఇంజన్ చక్రములయొద్ద ముందునకు వెనుకకును గొట్టుకొను గుండ్రమును స్థూలమును ఒకగజము పొడుగునుగల కమ్మిని మీరుచూచియుందురు. అది ముందునకు వెనుకకు బోవుగాని పిచ్చికుక్క వలె చుట్టిచుట్టి తిరుగుమన్న దానిచేతగాదు.

కావున నేయంత్రమైననుసరే నియమితమైన యొకేతీరున తిరుగుటమాత్రమేగాని పలుదెఱంగుల విహరించుట దానికి నతీతమైన మాహాత్మ్యము. చేతనాచేతనములకుగల ముఖ్యవ్యత్యాసములలో నిదియొకటి. అర్ధరూప్యము వెలజేయు కోడి తిరుగు తెఱగున లక్ష రూపాయలుచేయు యంత్రము దిరుగనేరదు. కావున అఖండములగు చిత్తరువులు యంత్రములచే రచింపబడుటకుగాదు. చీటీగుడ్డలు