పుట:Bhaarata arthashaastramu (1958).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. కార్యసాధనమునకు చలన మాధారము. ఉత్పత్తి యనగా రూపస్థలభేద మావిర్భవించుటయేకాని స్వతంత్రమగు వస్తుసృష్టి గాదనుట పూర్వమే ప్రకటింపబడియె. చలనమువలన స్థలభేదము కలుగుననుట స్పష్టము. రూపభేదమన్నను నదియే. నూలును బట్టలుగా నేయుట యననేమి? వాని నొకవిధముగా జేర్చుటయని కాదే? చేర్చుటయన్న స్థానాంతరకల్పనియేకదా? మఱియు, తుపాకీ మందునకు నిప్పుతగిలిన మందు మాయమై గర్జతో వాయురూపమైపోవును. బట్టలలో నూలు గోచరముగానున్నది ఇందు మందు అగోచరమైనది గదా! ఇదియు నట్టిమాఱ్పేనా వేరా? అని యడుగవచ్చును. మనుష్యకార్య సంబంధములనుబట్టిచూడ నిదియు భిన్నముగాదు. ఎట్లన, మందు డమ్ అని పెట్లుట అందులోని స్వతస్సిద్ధమైన శక్తిచేనైనదిగాని మనుష్యప్రభావ జనితంబుగాదు. మనకు సాధ్యమైనది యొకటే. ఏమన భిన్నములుగానుండు నిప్పు మందు వీనికి సంయోగము గల్పించుట. తక్కినవన్నియు నావస్తువుల స్వాభావికములై అంతర్గతములైయున్న గుణములప్రభావములు. కావున మనుష్యమాత్రులకుండు మాహాత్మ్య మొక్కటియే. చలనశక్తి. ఈయొక్కదానిచే లోకమునంతయు వశముగ జేసికొనుచున్నాము.

చలనశక్తికి నిదివఱలో బాహుబలమే తావలంబుగానుండెను. కేవల బాహుబలముచే నెంతని సాధింపవచ్చు? ప్రకృతము బాహుబలమునకుదోడు ప్రకృతశక్తుల బొమ్మలవలెనాడించు ధీశక్తి వచ్చినది. ఇకముందు అనంతములును అశ్రాంతములునగు ప్రకృతిశక్తులే సర్వముంజేయును. మనము మోటుపనుల గాలియైనదగులక నాగరికత గలిగి హాయిగ నుండవచ్చును.

అవునుగాని ప్రకృతిశక్తులను యంత్రముల నిమిడ్చినంగాని యవి మనకు సేవావృత్తి జేయవు. యంత్రోద్భూతికి ఇనుము బొగ్గు కావలయునుగదా! ఇంగ్లాండులోనుండు బొగ్గు ఇక నిన్నూఱేండ్ల