పుట:Bhaarata arthashaastramu (1958).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపజాతులు, కులములు మొదలగు సామాన్యములైన చిల్లర సముదాయములు ఎక్కడనులేని గౌరవమునొంది మతము, దేశము వీనికన్న మించినవై మనలోమనకు ననేకవైరములు ద్రోహములు గల్పించి సహించుటకుంగాని కట్టుదిట్టములచేబంధించి నికృత ప్రాభవులంజేసియు నింకనుం దృప్తిబొందక నవ్యమతంబుల పొంతంబోనీక యలయించు చున్నవి. మనవారల మతివైభవమునేమందు? విధిలేక చేసినవన్నియు విధిచేత జేయబడినవని భావించు మహాత్ములు గావుననే నేడు ఎన్ని వసతులున్నను దిక్కులేని నాటితెరవే సనాతనమైన దిక్కని నమ్మి యున్నారు.