పుట:Bhaarata arthashaastramu (1958).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లైన వాహనములు, జనుల తెలివిలేనితనము, చెప్పినను నేర్చుకొననేరని మొద్దుబుద్ధి, అమితవ్యయ వ్యాజములైన యాచారములు, అప్పుల మీది యాసక్తి. వాణిజ్యవిస్తృతి, చాలిచాలనిదానికి వక్కీళ్ళు, ఇంకేమికావలయు? కావుననే మొత్తముమీద భాగ్యము లుద్గాఢము లగుచున్నను ప్రజలగోడు వీడకుండుట.

ఇందుచేత రైల్వేలుకూడదనిభావముగాదు. వానితోడ చొరవ, తెగువ, చదువు, క్రొత్తసంగతులు తెలిసికొనవలయుననెడు శ్రద్ధ, మొదలగు సమర్థతాగుణమ్ములు నుండవలయుననుట యోచింపవలయు గాని యేదియులేక పూర్వస్థితినేయూది యునికి యర్హంబనుట యనుచితంబు. క్షీణదశకువచ్చినపిదప, నేకష్టమునులేకయే యుత్కృష్టత గాంతుమనుట బొంకు. "తనచేసిన దానంబడకపోవ శివునకు వశమే?" యని భారత ముద్ఘోషించెడిని. కావున నష్టము తొలుత గట్టిఇచ్చినంగాని లాభము వడయనేరము. తెలిసియో తెలియకయో తప్పుజేసి దేహము చెడగొట్టుకొన్నవాడు మందు పథ్యములు నాదరింపక ఆరోగ్యము నొందనట్లు మనమును పూర్వపాపపరిహారార్థము భంగముల కోర్చి పేర్చినంగాని దుర్గతివాయజాలము. మఱియు దలదగిలినగాని యేవిషయమును మనసున జక్కగా బాదుకొనదు. " పరమక్లేశమును జేసి పడసిన విద్యల్ స్ఫురియించు" నన్నట్లు కడగండ్లంగాంచి కనుగొన్నంకాని యనుభూతములు మఱపులేక నిలువవు.

భరతఖండం వివిధవేషభాషాది విన్యాసముందాల్చి లిచ్చిన్నమై యసంసృష్టములైన సీమలు, దేశములు, జిల్లాలు, తాలూకాలు గలిగి యుండుటకు శీఘ్రయానంబులేమియు అరాజకోద్భవములైన భయములును గారకములుగాని, యిందు బ్రహ్మదేవుని ప్రభావమేమియులేదు. దూరపుసంబంధములు లేని బ్రతుకగుటచేత, దేశాభిమానము, దేశీయు లెల్లరు మనవారనుబుద్ధియు నుదయింపదయ్యె. మఱియు జాతులు,