పుట:Bhaarata arthashaastramu (1958).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యానతత్త్వము వినిమయ కాండాంతర్గతంబుగావున నింక నొకటిరెండు సందర్భములు సూచించి విరమించెద.

హిందూదేశములో క్షామబాధనివారణక్రియకు ధూమ శకటం లమోఘసాధనములు. చెన్నపురిలో పంటలుపాడైన బంగాళా, పంజాబు, బర్మా ఇత్యాది సీమలనుండి ధాన్యము దండిగ దేబడును. అయిన నొక యుపాధి. పండినదేశములలో గూడ నెండినదేశముల కెగుమతిచేయుటచే వెలలు పైనికి దలయెత్తును. అయినను మొత్తమున రాజ్యమునకు శుభమేయెక్కువ.

ప్రజలు విద్యావివేకహీనులై వాణిజ్యచాతురి లేనివారుగానున్న నిరర్గళ గమనమార్గములు వారికిగీడుదెచ్చినను దేగలవు. అదెట్లనిన, నేర్పుగలవాడు అనాయాసముగ దేశసంచారముజేయుచు ఈమూఢులను మోసపుచ్చి తక్కువవెలలకు వస్తువుల గ్రహించుట, అప్పులిచ్చి ఫలిత మడమానముగానుంచుకొనుట ఇత్యాద్యకృత్యము లొనరింప జాలును. మఱియు వకీళ్ళు, రాజసేవచేబ్రదుకువారు, సాహుకార్లు మొదలగు ధనికులు, సాధారణముగ గొప్పపట్టణములలోనె కుదురుగా నుండి బయటకదలక యుండువారయ్యును, సుఖప్రయాణములు కుదిరిన, బయలువెడలి గ్రామస్థులను బేలుపుచ్చియో డబ్బుజూపి వికలత నొందించియో వారిభూములగొని తమవశము జేసికొనుటకు ప్రారంభింతురు. ఇవి యనుభవవిదితములైన బాధలుగాని యస్మత్కపోల కల్పితములుగావు. ఇతరులతో సమానమైన శక్తికలిగి యాత్మరక్షణ దక్షుడుగానుండిన నెందఱితో గలసిమెలసియున్నను భయములేదు. అట్టిశక్తిలేనినాడు తనపని తానుజూచుకొని, పరంపరగవచ్చు సమీపస్థులబాయక, యొక పెద్దతనమునకుంజొరక, మూలనుండుటయేతగవు. ప్రతాపము జూపుదమను నాశతో విఱ్ఱవీగిన ముప్పుమూడును.

ఇపుడు మనదేశములో ఘటికులు ప్రజలను గొల్లగొట్టుటకు నెల్లవిధముల వసతులుబదిలములై యున్నవి. అవియేవనిన వేగవంతము