పుట:Bhaarata arthashaastramu (1958).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లచే గోపాలురును గోపాలులచే బోయలును పరాక్రమహీనులై అడవులపాలయినట్లు కళాదక్షులయిన వారిచే నపహృత విభభులై పరితపులగుదురు. కాలనియమంబిట్లు. తాటాకులకట్టచే కాలంబు వార్యంబు గాదు. అనుసరించుటచేతనేగాని నిరసించుటచే గాలము నెన్నటికిని జయింపజాలము. కాలవశతయని మరణమునకు బర్యాయపదం బొండు గలదు. దీనిభావమేమన కాలమునకోడుట. అనగా కాలానుగుణములౌ వర్తనముల నిరసించి యోటమి దెచ్చుకొనుట. దీనికై ప్రతిక్రియ యేదనగా యథోచిత మార్గముల నవలంబించి మనమును మార్పులు వడయుటయే. అట్లుచేసితిమేని స్వకీయప్రాణంబులు గోల్పోయినను జాతీయప్రాణములు నిలుచును. మనకర్మఫలంబులు జాతిలో నావేశించి స్థిరతనొందుగాన నొకవిధమున జాతిలో లయించినవారమగుట మనమును చిరంజీవుల మగుదుము.

యుగక్రమ మనగానేమి?

పై చర్చలలో నొకయుగాంతరమున మఱియొకయుగము ఉపక్రమించునంటిమి. అనంతరమనగా కాలానంతరముగాదు. ప్రాధాన్యానంతరమనుట. వివరమెట్లన; నేటికిని వేటాడి జీవించువారుం గలరు. మందలందోలుకొని యడవుల గొండలంబడి తిరుగువారునునున్నారు. ఐనను వీరికి పూజ్యతలేదు. వీరు గౌరవింపదగినవారని పిచ్చివాడు సైతమాడడు. అదేరీతిని కృషికళాయుగంబులంగూర్చియు. ఒకటి చచ్చి వేఱొకటి మొలచుననికాదు నాయర్థము. మఱేమన మహదరణ్యంబున సింగంబులు చేరినతోడనే మ్రుక్కడి మృగంబులు విపద్దశకు వచ్చి నానాటికి భక్షింపబడి కాలక్రమేణ పర్యవసానము జెందు తెఱంగునను, మహీరుహంబు నిగనిగలాడుచు నెగయుకొలది పరిసర భూజంబులు గాంతిదఱిగి తుదకు నయ్యది ఆశాంతంబుల జుంబించు కొమ్మలతోను వర్షాతపములకుం జొఱరాని వర్ణములతోను సమున్నతి జెందువఱకు నివి శీర్ణతజెంది తుదకుగ్రుంగి రూపఱివోవుమాడ్కిని,