పుట:Bhaarata arthashaastramu (1958).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణించిరి. ఇప్పటివారు ఇయ్యది విరుద్ధవాదమని ఖండింతురు. ఎట్లన ఇహపరములు రెంటికిని సృష్టికర్తఒక్కడే. ఒక దానిని దైవము నింకొక దానిని దయ్యమును నిర్మింపలేదుగదా! కరుణాశాలియు నిర్ణిద్ర ప్రభావుండునైన ఈశ్వరుండు మనము ఇక్కట్టులం జిక్కునట్లు ఒండొంటి పొత్తుపొసగిని లోకంబుల సృజించెననుట సర్వసముండగు నప్సర మాత్మునకు క్రూరతయు హీనతయు నారోపించుటగాదే! ఇందును నందును మనము సుఖులమైయుంట యాతని యభిమతంబనిన నాతనికి దక్కువయగునా? ఇది పరస్పరాసంభవ సిద్ధాంతము. ఇహపరములు పరస్పరాసంభవములనుట ఈలోకంబు నాచుకొననెంచిన వంచకులచే బుట్టింపబడిన ప్రమాదమేగాని యపార దయారసవారిధియైన ఈశ్వరుండొనర్చిన యక్రమముగాదు.

తత్త్వశాస్త్ర విషయంబులివ్వి. విస్తరించి చర్చించుట కిట నవసరముచాలదు. ఆధునికుల ఆలోచన ప్రసరించుమార్గము మాత్రము సూచింపబడియె అంతియెచాలు. లౌకికంబు పరమధర్మంబనుట సర్వకోవిదులకును సమ్మతంబ. ఒకానొక అఖండజ్ఞానమాన్యుండు "దైవం పురుషరూపేణ" అన్నట్లు "మానవసంఘమే దేవుడు; దానికై పాటుపడుటయే అర్చ, ధ్యానము, తపస్సు అన్నియును. అంతకు మించిన పూజలులేవు" అని వ్యాఖ్యానము మహోదారముగ జేసి యున్నాడు.

మతములకు నార్థికస్థితు లాద్యములు

తొల్లి మానవులు ప్రకృతికి వెఱచువారు. ఉఱుములు, మెఱుపులు, తుఫానులు విసవిసవిసరు గాలులు, అంధకారమున నాకొన్నట్లు భయంకరముగ తలచేతులాడించి హుంకరించు రాక్షసులంబలె నల్లాడు చెట్లును, ప్రతిధ్వనులుమ్రోయు గుహలును, అగమ్యపర్వతములు, తటాలున వెల్లువగా బాఱిచిక్కినవాని నన్నింటిని నోటవేసికొనిపోవు నదులు, సర్పములు, క్రూరమృగములు ఇత్యాదులంగాంచి ఎఱుక