పుట:Bhaarata arthashaastramu (1958).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను పద్యమున సూచింపబడినట్లు ప్రజలును దేశమును ఒండొంటి నంటియేయుండును. ప్రజలులేనిది సంఘముసున్న. సంఘము సున్నయైన బ్రజలంతకుమున్నుసున్న. కావున సంపూర్ణాహంకృతి నిరహంకృతులు గర్హ్యములు. "పదిమందికి ముప్పుమూడిననేమి? నేను చివుక్కున గైలాసమున కెగిరిన జాలు" నని మక్కువగొన్నవారు నీతిపరు లేనాడుంగారు.

ఇంతేకాదు. మోక్షేచ్ఛ, జనులయొక్క సొమ్ములాగి బదులు రొక్కమియ్యక చక్కనిమాటల బేలుపుచ్చుటకై, రాజులును గురువులును పూజారులును బన్నిన కుయుక్తియేగాని వేఱొండుకాదనియు గొందఱి తత్త్వశాస్త్రజ్ఞుల యభిప్రాయమైయున్నది. ఇందునకు దార్కాణము చూడుడు! హిందువులలో ధనేషణము వర్జనీయమైనను బ్రాహ్మణులకు ధనకనక వస్తువాహనాదుల సమర్పించుట స్వర్గహేతువని ధర్మశాస్త్ర ముపదేశించును. దీనింబట్టిచూడగా బ్రాహ్మణేతరులకు ధనము కూడదనుటయు బ్రాహ్మణుల కెంతయున్నం జాలదనుటయు స్పష్టము. అనగా మోక్షమునకై ధనమును మార్చుకొనుట, తెలిసినవారు గావుననే అగ్రగణ్యులు ముఖ్యమైనదాని గ్రహించి మోసమైన దానిని ధారవోసిరి. "ముక్కుమీదనే నిగాయుంచరా నాయనా" అని బోధించి యొకండట్లుచేయ ముల్లెలాగుకొన్నట్లున్నది. ఈ యవివేకము మనదేశముననేగాదు. ఐరోపాలోను మిక్కిలిగ వ్యాపించి యుండినది. కాని నవీనతత్త్వములు బయలుదేరినపిమ్మట మతాచార్యుల యాదాయముబుడముట్ట నశించుటచే వారు మిక్కిలి చీకాకు పడుచున్నారు.

ప్రవృత్తి నివృత్తి మార్గములు

పూర్వులు ఇహపరంబులకు వైరంబారోపించిరి. ఈ లోకమున వన్నెవచ్చిన నాలోకమున సున్నవచ్చుననియు అచ్చట సౌభాగ్యము రాలయునన్న ఇచ్చట వైరాగ్యమున బోవలయుననియు వక్కా