పుట:Bhaarata arthashaastramu (1958).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బేరసారములజేసి ఇంచించుక గరుపతనమును బడసినవారైరి. మూలధనం బిట మొట్టమొదట నవతరించె. దానితో వసువులును విపులంబులగుడు రక్షణార్థము సంఘముగాకుదిరి ధనాఢ్యు నొకని నధిపతిగా నేర్పఱుచుకొని శాసనంబుల నిర్మించుటంజేసి ధర్మాధర్మములు సంభవించె గోపతి పశుపతి యను నామములు శివునందును రాజునందును బ్రవర్తిల్లుట కిదియేహేతువు. ఆదిని మందలు బహుళముగ గలవాడు రాజౌటయగాక ధర్మకర్తయు నాయెంగావున వానిని కేవల మనుష్యుడని భావింపక భగవంతుడేయని యందఱుం గొలిచిరి. అర్థము, సంఘము. ధర్మము ఇవి పరస్పరాశ్రయములు. చూడుడు! ఏకాకిగ నడవులం గ్రుమ్మరువానికి సత్యాసత్యములు స్వపరప్రయోజన పరతులు మొదలగు ద్వంద్వమ్ముల భాధయుండదు. అట్టిపురషుని సన్మార్గుడని గాని దుర్మార్గుడనిగాని చెప్పవలనుపడదు. నీతి సంఘసంబంధి సంఘత్యాగము ధర్మత్యాగము. న్యాయాన్యాయములకు నతీతుడైన వానప్రస్థుడు పరమాత్ముడో మృగవృక్షజడప్రాయుడోకాని మనుష్యుం డేనాటికింగాడు. అర్థముల ననర్థములనుట ధర్మార్థ సంఘసంయోగము నెఱుగని దోషమేకాని విజ్ఞానచంద్రికగాదు.

మఱియు జిఘత్సయే జిగీషకు హేతువగుటంజేసి శిల్పంబుల చిత్తరువుల, విద్యల నుపకరణా సాదమంబుల నాసక్తి గొనుటకు నవలంబంబైన విరామంబు మిక్కుటముగ రాజిల్ల దొడంగె. మృగంబులు తెఱపిలేక దినమంతయు నుదరనిమిత్తమై క్రుమ్మరును. అట్లు స్త్రీ పురుషులును అనవరత ముదరనిమిత్తోద్యోగులైన విద్యావినోదములకు వలనగు విరామంబు నందజాలనివారై మృగప్రాయు లౌదురు. అయ్యో! మనదేశమున ప్రకృత మెన్నికోట్లజనులీ దురవస్థజిక్కి తమ కిట్టి దశ వచ్చెగదాయని యోచించుటకుం బరితపించుటకుంగూడ మతిలేని వారైయున్నారో తలంపుడు! అట్టివారి కీయోచన లేకుండుటయే తత్కాలమునకు మేలుగావున, అపరిమిత శారీరశ్రమ నొనరించువారికి