పుట:Bhaarata arthashaastramu (1958).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజృంభింప నవసరమొసగునదిగాన కాలంబు మనకు మహోపకారియయ్యె. కార్యప్రారంభ పరిసమాప్తులకు నడుమ కాలమెంత దీర్ఘత గనునా ఆర్జనమును అంత సమగ్రత జెందును. నేరుగా వినియోగ్యముల సంపాదించుటకన్న పనిముట్లు మొదలగు సాధనముల సహాయముచే పరోక్షముగా నాహరింపంజూచుట సుఖాధిక్య హేతువు. ప్రత్యక్షమునకన్న పరోక్ష మెక్కువఫలవంతము. కావున దొలుత గాలవ్రయమైనను తుదకు ననాయాసమగు నుద్యోగప్రాప్తి యగుంగాన మొత్తం మీద భవిష్యత్తును లెక్కించిచూచిన కాలమెంతో మిగులును.

3. కొందఱు ఉత్పత్యర్థమైనవికాని విత్తంబులు మూలధనంబులుగావనియండ్రు. మఱికొందఱు పుంజీభవించి స్థిరతదాల్చి చిరకాలయోగ్యములైన వస్తువులును పరిపణములేయని యందురు. ఇంకనుం గొందఱు ఎద్దానినుండి యాదాయమువచ్చునో అయ్యదియు నీవియేయని వాక్రుచ్చిరి. చూడంబోయిన నీమూడభిప్రాయములును యాథార్థ్యము గలవిగాను కొంతకుగొంత పరస్పర మిత్రములుగను వున్నవి.

పెద్దలు గడించిపెట్టిన ఆస్తితో వడ్డిజీవనము జేయువారు ఉత్పత్తి కెట్లుసాధకులగుదురు? వీరు వ్యవహారులకేగాక త్రాగుబోతులకును ధనికులకును అప్పులియ్యవచ్చును. భోగములయందు వ్రయము చేయువారు దేశమునకు నష్టము దెత్తురుకాని లాభముతేరు. ఇట్టివారి సొత్తుల గుదువబెట్టుకొని వడ్డి బిగబెట్టి వచ్చుబడి ననుభవించువారు అప్పుగా విచ్చిన ద్రవ్యము మూలధన మౌనాకాదా? ఉత్పత్తికి నిజముగా ప్రతికూలమే యయినను ఇదియు మొదలేయని యందఱును వాడుకొందురు. ఏదియెట్లుండినను తన కుత్పత్తికరముగానేవున్నదిగదా!

ఒకానొకవైద్యుడు వృత్తివిషయమై రాకపోకలు చేయుటకునై బండినుందుకొనియెబో. ఉత్పత్తర్థమైనది గాన నిదియు మూలధనమే. అదేబండిలో దానును దనభార్యయు గూర్చుండి షికారు వెళ్ళిరేని