పుట:Bhaarata arthashaastramu (1958).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. కాలమును రక్షించుటయేకాదు. కాలమును ప్రతీక్షించుటకును ఇది దావలంబు. ఘనతరోద్యమములు ఒకనాట నొకయేట సమాప్తినొందవు. కార్యము పండవునంతవఱకు చేతిలో నేమియులేని వాడు వేచియుండజాలడు. కాచియుండనేరని కర్మమువలనగాదె కూలివాండ్రు తక్కువ జీతమునకు విధిలేక కుదురవలయుట? కాలం బేరీతి ననుకూలత ఘటించుననుట కింకను ఒక దృష్టాంతము. బావిలోని నీరు త్రాగవలయునన్న దాహమైనప్పుడెల్ల దిగి చేతితోగొని త్రాగవచ్చును. ఇందు కార్యారంభమునకును పూర్ణతకును కాలభేదము మిగుల స్వల్పము. ఫలమును గొంచమే. ఎన్నిమార్లని దిగి కొంచెము కొంచెముగా ద్రావుచు వృధా కాలవ్రయ మొనర్ప వలయుననియెంచి ఒక్కవారము పనిజేసి ఒకకుండను త్రాడును సంపాదించినవాడైన దినమునకు రెండు మూడు పర్యాయములు చేది పెట్టుకొన్న జాలివచ్చును. ఉత్పత్తిచేయుటలో దాక్ష్యము హెచ్చ వలయునన్న యత్నమునకును వినియోగమునకును కాలభేదమును హెచ్చును. ఇంకను గాలభేదమునకోర్చి గొట్టములు యంత్రములు గడించిన తలచినప్పు డశ్రమమున దలచినన్ని నీళ్ళు దొరకును.

కాలప్రభావ విమర్శనము

కాలంబిట్టి ప్రభావము నొందుటకు గారణంబు గలదు. ఎట్లన, ప్రకృతిశక్తులు మనకుం దోడ్పడవలయునన్న అనువగు నుపకరణములం గూర్పవలయు. ఇందుల కెంతోకాలము పట్టును. ఆవిరిశక్తి, విద్యుత్కాంతి ఇవి మనకులొంగి సేవజేయుటకు యంత్రనిర్మాణము ప్రధానము. అతిచాతుర్యము గలిగినవాడు సాధనకలాప సృష్టిచే దనకోరికలన్నింటిని ప్రకృతిశక్తులచే హాయిగ గూర్చుండి యీడేర్చు కొనవచ్చును. స్వచ్ఛంద ప్రవర్తన పూర్తిగనో కొద్దిగనోకల మనుష్యులవలెను మృగములవలెనుగాక నిద్రాహారములులేక చెప్పినట్లు మఱుమాటాడక పనిచేయునవి యంత్రములు. స్వాభావిక శక్తులు