పుట:Bhaarata arthashaastramu (1958).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిగలవారమగుటచే మనదేశమున సంఘము శిధిలమైపోయినది. మఱియు దూరదేశ ప్రయాణములు విస్తరించుటకు ప్రతికూలములైన ఆచారాదులు తిథివార నక్షత్రములు నసంఖ్యములుగ నుండబట్టి వ్యవహార వాణిజ్యంబులు మనయెడ సంక్షిప్తంబులయ్యె. సంక్షేప వ్యాపారముల కెక్కువ మూలధన మక్కఱలేనందున నార్జన బుద్ధియం దుపేక్ష వహించినవారమైతిమి.

అడ్డంకు లట్లుండగా వితరణమును నిర్మూలించు కష్టసంప్ర చాయములు మనలో లెక్కకు మిక్కిలిగగలవు. అవియేవన చచ్చిన వారు చావగా బ్రదికినవారును యావజ్జీవము శవంబులట్లుండుటకై విధింపబడిన దానధర్మాదులు, పెండ్లికాలమునందు శక్తికిమీఱి సెలవు జేయవలసినదని భార్యాబంధువులు నిర్బంధించుట మొదలగునవి. కావున మనకు నూలిపూసయంతైన మిగులబెట్టుట కష్టమైనది.

ఇంగ్లీషువారి కృపచే మనకును గొంతకుగొంత బుద్ధికుదిరి ఇప్పుడిప్పుడు వృద్ధికి వచ్చుచున్నాము. బొంబాయి, అహమ్మదాబాదు ప్రాంతములలో మనదేశస్థులు దూదియంత్రశాలలు మొదలగువానికి యజమానులై ప్రబల వ్యాపారపారీణులై యుంటజూడ దారిద్ర్య దేవత నిక ముందైన వెడలగొట్టగలముగదా యను కుతూహల మంకురించెడి.

మూలధన ప్రవృత్తి

వస్తుసమృద్ధికి బీజంబునుం బోనిదగుట నింకను విస్తరించి మూలధనముయొక్క గుణముల గీర్తింపవలయు.

1. దీనిచే కాలము వృధా వెచ్చింపబడక మిగులును. చేతులతో మడిని విత్తుటకు బక్వము చేయవలయునన్న నెలలు పట్టును. అదేమడకతో జేయుదుమేని కొన్నిదినములు చాలును ఇట్లు మిగిలిన కాలము నిద్రకు నాహుతిగానీయక ఇతర యత్నముల గొనసాగింప వచ్చును గాన ఉత్పత్తి యుద్దీపించును.