పుట:Bhaarata arthashaastramu (1958).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూసారాదులు కృషింపలేదా యను బ్రశ్నయే యిందులకు బ్రత్యుత్తరము.

వినియోగమునకు నవసరమైన క్రియలన్నియు సార్థకములే

పోలీసువారు, వకీళ్ళు, ఆటపాటల నభినందింప జేయువారును సార్థకులా, నిరర్థకులా యనుట విచారణీయము. ఉల్లాసము నుత్సాహము నిచ్చును గాన నాటక ప్రదర్శనాదులును పరోక్షంబున సఫలంబులే. విరామములేక ఎడతెగని యత్నములం దొడరియుంట యెవ్వనికిని సాధ్యంబుగాదు. కొందఱు విరామసమయంబున పరిశ్రాంతియని భ్రమించి యేమియు జేయక శయనింతురు. ఇది మూడత్వము. నిష్కర్మత క్లేశకరంబు. దేహమునకు మనమునకు నాయాసము దెచ్చునది. విశ్రాంతియనగా కార్యాంతరగామియౌట. భూమి వివిధ సస్యంబులం బంటబెట్టిన నేరీతి నవంధ్యయై పరిడవిల్లునో అట్లే వివిధ కృత్యాచరణంబున మనమును అక్షయ బలోపేతుల మగుదము. మఱియు బనులెంత శ్రద్ధవహించిచేతుమో విరామంబున నంత యాసక్తితో క్రీడాపరాయణుల మగుదుము. మందులకు రెంటి యందును తవులు తక్కువ. యూరోపియనులు కార్యములపట్ల సాహసోదగ్రులుగాన వినోదప్రియులు నైయున్నారు. ఆటలయం దాదరాతిశయము గల్గియుంట కర్జంబు గాదనుట కరము ప్రమాదంబు.

ఇక ఉద్యోగస్థులన్ననో వీరును దొరతనము నడుచుటకు పాత్రములు. రాష్ట్రంబు చక్కగ పరిపాలితము గాకపోయిన "ధన దారాదికముల నెవ్వనికిని రక్షింపవశమె?" అని శుక్రాచార్యు లన్నట్లు ఒక్కసంపదలేకాదు ఎవ్వియు మనకు నిలువజాలవు. కాన నేయుద్యమమునకుం గడంగుట గలుగదు. ఈ దేశ మరాజకమై వివిధోత్పాత పీడితంబౌటబట్టికాదె మనము తాత్కాలిక ఫలాపేక్షులమై ఉత్తర కాలముల నరయక చిక్కినమట్టు చాలునని యీ గతి పౌరుషహీనులై