పుట:Bhaarata arthashaastramu (1958).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సార్థక విరర్థక శ్రమలు

సార్థకము నిరర్థకము అని శ్రమ ద్వివిధంబు అని కొందఱి అభిప్రాయము. కృష్యాదులలో ఒకతూము వడ్లుచల్లి యొకపుట్టి వడ్లుం గైకొందుము. గనులు త్రవ్వుట మొదలగు క్రియలలోను నిట్లే. పరిగ్రహణక్రియలలో వెచ్చింపబడిన దానికన్న ఉత్పన్నమగు రాశి అధికముగాన నిక్కమైన యుత్పత్తి వీనిలో గలదుగాని, రూపస్థలభేద మాత్రంబునుంజేసి రాశిని వృద్ధిజేయని కళావాణిజ్యాదులు సార్థకములు గావనియు వానిచే సరకులకు గురుత్వంబు రాదనియు దర్కించుట పూర్వపక్షము. దీనికి ఉత్తరపక్షమేమన్నను 1. సరకులు బరువెక్కువగాకున్నను యానవాణిజ్యాదులచే పూర్వము వివరింప బడినట్లు వానియుపయుక్తత వృద్ధికివచ్చును. కావున నివి సార్థకములే. 2. కృషియందును పరిమాణవిస్తృతిలేదు. "ఇదేమి చిత్రము. ఒకచిన్న గింజనునాటి కౌగిలికినందని గుమ్మడికాయ లిరువది యుత్పత్తి జేయుచున్నాముగదా! పరిమాణవిస్తారమిందులేదా?" అందురేమో కనుగొనుడు! గుమ్మడితీగపీల్చు నీరు గాలి సత్తున వీనినన్నియు జేర్చి తూచినచో ఆగింజనుండి యుద్భవించిన ఆకులు పువ్వులు పండ్లు వీనికి సరిపోవును. ఇది పరీక్షించి కనుగొన్న న్యాయంబు విశ్వమునందు మార్పాటులు గలవుగాని ప్రకృతి యెచ్చు తక్కువలు బొందుట యసంభవము. ఒకవస్తువు వృద్ధిజెందుట యనగా నేదైన ఇతర పదార్థమునుండి సారము గ్రహించుననుట. కావున నొకచో పెఱుగుట యున్న నింకొకచో తఱుగుట యుండును. ప్రకృతి పరిమాణము వికార రహితము.

కృషియందు ఎక్కువపంట లభించునట్లే కర్మలయందును జేయవచ్చును. సాలెవాడు దట్టముగ రంగుబట్టించిన నాదోవతి దానిలో బెట్టబడిన నూలుకన్న బరువుగ నుండును. రంగు పదార్థముయొక్క రాశి తగ్గినదిగదా యని యాక్షేపింతురేమో కృషిలో మాత్రము