పుట:Bhaarata arthashaastramu (1958).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహు హానికలిగె" నని నుడువ, అదెట్లని నేనడుగుడు నత డిట్లనియె . "కోళ్ళు ,మేకలు పెంచుటకు వేరుశ్రమయంతగా నక్కరలేదు, పైరులనుండి ! వాలిన గింజలు స్వచ్ఛందముగ పెరిగిన గడ్డి మొదలగు వానితో నవి యెదుగును. పంటలతో నివియునుండిన ' భోజన పదార్థము లెక్కువయౌననుట కేమిసందేహము. అంతేకాదు. పక్షులు యధేచ్ఛా విహారములుగాన పయిరులను బాడుచేసి ధాన్యమును దినిపోవుచున్నవి. ఈ నష్టముచే బంట నూటికి బది బదినేనువంతులు దగ్గుచున్నది. మీరు వానిని దినరు. వానిచే మిమ్ముల దిననిత్తురు. ఇది యేమివెఱ్ఱి? బరోడాలో బదేడులక్రిందట ఎలుకలు పండినగింజలం దినిపోవుటంబట్టి క్షామంబు దటస్థించె. ఈ మాట నీదేశములోజెప్పిన నందఱును నవ్వుదురు ఎలుకలచే భక్షింపబడు జనులున్నారా యని యాశ్చర్య మొందుదురు. అహింస మంచిదేకాని మనుష్యులకు హింస రాకయుండునట్లు భద్రమొనర్చుట ఇంకను మంచిది. పాములను బులులను జంపువారు వేరుమార్గముల నంతకన్న క్షోభబుట్టించు ఎలుకల నేల చంపరాదు? అందులో లేనిపాప మిందుమాత్ర మెట్లు వచ్చె? ఈ దేశములో పొలము కాపులు ఉదయమున నాయుధపాణులై గింజలు మిక్కుటముగమెక్కు పావురము మొదలగు పక్షుల వేటాడుదురు. ఇందుచేత ధాన్యము మిగులుటయేకాదు. ఇంకొక మోస్తరు ఆహారమును లభించును. మఱి మాంసాశనంబు శాఖభక్షణమునకన్న నెక్కుడు బలప్రదంబు. మీదేశంబులో వేదురుగొన్న అహింసంబట్టి భూమినుండి సగముమాత్ర ముత్పత్తిచేయబడుచున్నది. ఆచారభిన్నులైతిరేని ఫలితము ననాయాసముగ ద్విగుణము జేయవచ్చును" అని మందలించు తఱికి భారతములోని

       చ. సలిలము లుర్వియాకసము సర్వము జంతుమయంబు గావునన్
          గలుగు వశ్యమున్ సకలకర్మలయందును హింస; హింసకుం
          దొలగిన దేహయాత్రయును దుర్ఘటమై నటులుండు: వింతయుం
          దలపరు, హింసచేయమని తారచరింతురు కొందఱిమ్మహిన్.