పుట:Bhaarata arthashaastramu (1958).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జక్కగా ఫలించును? నేల క్షీణతకురాక క్రొవ్వెత్తుటకు దగిన చికిత్స లెవ్వి? యను విషయములను నిర్వచింపవలయునను అద్భుతోద్యమము గొనియున్నవారు. సాహసోదగ్రుల కనపహార్యమైన రహస్యములేదు గాన వ్యవసాయశాస్త్ర మింకను వీరిచే నెంత వికాస మొందనున్నదో యెవరెఱుగుదురు!

బ్రిటిష్ గవర్నమెంట్ వారు శాస్త్రానుసారమైన సాగుబడి యీ దేశములోని కాపులకును తదితరులకును నేర్పుటకునై కోయంబత్తూరు, పునహా మొదలగు స్థలములలో వ్యవసాయ కళాశాలల స్థాపించి యున్నారు. మఱియు గ్రామపాఠశాలలలో నీవిషయము బాలురకు బోధించుటకు దగిన ఏర్పాటులు చేయుచున్నారు సెనగకాయలు, ప్రత్తి, వరి, చెఱకు వీనిలో మేలైనరకములు అన్యదేశముల నుండి తెప్పించి యెంతమాత్ర మిచ్చోట వృద్ధికివచ్చునోయని శోధనలు జఱుపుట, ఆస్ట్రేలియా అమెరికానుండి నూతనములగు నారింజ మొదలగు ఫలవృక్షముల దెప్పించుట. విదేశపు గోవుల నిచట వాలాయముగ బెఱుగువానిని దెప్పించుట, మొదలగు ననేకవిధముల మనకు మేలుజేయ గడక గొనియున్నారు గాని మనవారి మూర్ఖతయు నవవిద్వేషమును అందులకు విఘ్నములుగా నున్నవి.

యుక్తవిధానమున సేద్యమునుజేసిన భూసత్త్వం బనశ్వరమయి యింకను ఉద్ధురమగునని శాస్త్రజ్ఞులు కొంద ఱభిప్రాయపడెదరు. ఈ విధానములలో ముఖ్యమైనవి నాలుగు.

1. మన్నును ద్రిప్పివేయునట్టి మడకలతో లోతుగాదున్నుట, ఇందుచే లోభాగపుమన్నున కెండవేడిమి తగులును. సూర్యకాంతిచే శ్రేయస్కరమగు మార్పునుజెంది భూమి సారముగలదియగును.

2. దోహదములు. చెట్లు పొగరెక్కి పెఱుగుటయేగాని పూచి కాచుట లేనిచో ఆ మదము నణగించుటకు ననేక తంత్రములున్నవి. ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో ఆ చికిత్సలజేయుట.