పుట:Bhaarata arthashaastramu (1958).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఱిసి జగమున మిలమిలలాడును. అందఱికిని జాలినంత యాహారము నుండదు. ప్రకృత కాలమున గృషికి గలిగిన దౌర్బల్యమువలనను జనులు నానాటికి వృద్ధియగుటవలనను గలుగు శ్రమలను బోగొట్టి ప్లేగు కలరా మొదలగు వ్యాధిదేవతలు చేతనైనంత లోకోపకారమును జేయుచున్నవి.

హీనవృద్ధికి బ్రతికూలములైన హేతువులు

ఐననేమి! ఏడులకొలది నరు లధమగతు లగుదురా యన్న నట్లగుట విధికాదు. కృష్యాదులను వృద్ధిజేసి యిదేభూమిలో నిప్పటికన్న నెన్నియోమడుంగుల ధాన్యము నుత్పత్తి చేయవచ్చును. జపానుదేశములో వర్తకములు కళలు వ్యాపించి పదునైదు సంవత్సరములే యైనను నాటికన్న నేడు పంట రెండింతలుగానున్నది ఈ యద్భుతమునకు వారి శక్తిసామర్థ్యములును నవీనాచార పరాయణత్వమును గారణములు. వారు దున్నుట, విత్తుట, కలుపుదీయుట, కోయుట మొదలైన పనులలో నధికానుకూలములైన క్రొత్తక్రొత్త విధానముల నవలంబించుటయేగాక "ఇంత మంచిస్థితిలో నున్నాము, ఇక విశ్రాంతిగ నుండవచ్చుగదా" యని తనియరు. ఆ దేశములో సర్కారువారు పరీక్షించి తగినదని యామోదింపనిది ఎరువు విత్తులను అమ్మగూడదు. ఈ మార్గపరిశీలనమునకు దొలుత దారిజూపినవా రమెరికా దేశస్థులు. చెఱకు, వరి, గోధుమ, పొగాకు మొదలగునవియు, గొఱ్ఱెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, కోళ్ళు అన్నియును మనముందువారికన్న నెక్కువ మేలైనవిగాను పుష్కలములగాను నొనర్చి యింకను నూతన ప్రయోజనముల నన్వేషించుచున్నారు. నాగదాడిని గొడ్లకు మేతగాజేసిరి. చవిటినేలల వృద్ధియై పశువులకు ఆహారములగు చెట్లను గనిపెట్టిరి. హిందూదేశమునకన్న ఎక్కువ వైశాల్యము గలిగిన యా దేశములోనుండు ప్రతిభూమిని తద్భాగములను చక్కగ బరీక్షించి గుణదోషముల గనుగొని ఏపైరు లెట్లు కృషిజేసిన