పుట:Bhaarata arthashaastramu (1958).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రిగుణముగ మార్కులు రావలయునన్న నైదాఱుమారులు చదివినను దుస్తరము. బావులలో బండమీది పాచిని ఱాత రుద్దుదుమేని పదినిమిషములలో సగము పాచిపోవును, తక్కినసగము ఒకగంట రుద్దినను బొత్తిగబోదు.

హీనవృద్ధి న్యాయముయొక్క ప్రభావము

దీనివలన గలుగు విశేషము లెవ్వియనుట యోచింపవలసిన విషయము. ఒకేతీరున కృషి జేయుచుంటిమేని ప్రాతభూములు నానాటికి సమసినవై తక్కువ తక్కువగా ధాన్యము లొసగును. ధాన్యరాసులు స్ఫారములు గావలయునన్న క్రమము దప్పక యెక్కువ జాగ్రత్తతోను కష్టముతోను నేలలు క్షీణింపకుండునట్లు సేద్యము జేయవలయు. అట్లుగాక తాతముత్తాతలరీతినే యుండుదమన్న కాలముగాని భూమిగాని యా రీతినే యుండక మార్పులు జెందుటవలన నివియు దాతముత్తాతలకడకే చేరును.

ప్రాతరాజ్యములలో జనసంఖ్య హెచ్చుగనుండుట సహజము. ముఖ్యముగా నిర్బంధ వివాహములకు నాకరమైన ఈ కర్మభూమిలో మేతకు మీఱిన ప్రాణు లుండుట యేమి యాశ్చర్యము? జనులెంత వేగముగ వృద్ధిజెందుదురో యంతకన్న వేగముగ నాహార మతిశయించినంగాని సుభిక్షత కలుగుటెట్లు?

ప్రాణికోటులను పరీక్షించినవారు ఆహారమునకుమించి జంతువులు వృద్ధిజెందుట స్వాభావికమనియు కావుననే జంతుజాలములో నన్యోన్య విరోధములు సంభవించి కలహములు నడుచుచున్నవనియు వక్కాణించెదరు. మనుజులలోను ఈ వర్తన సహజముగా నున్నయది. కావుననే యుద్ధాదులు జరుగుట. ఈ నియమమేలేకున్న సర్కారు వారికి న్యాయస్థానముల నేర్పాటుజేయుటయు నందుచే గలుగు వ్రయమును లేకయుండును. మృత్యువేలేక యిరువదియేడులు గడచిన యెడల మనకు నిలుచుటకు జోటులేనంత సాంద్రముగ బ్రజ క్రిక్కి