పుట:Bhaarata arthashaastramu (1958).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లగునవి భూమియొక్క శీతోష్ణ స్థిత్యాదుల ననుగమించియున్నవి. ఇంతేకాదు. జనుల స్వభావములు సైతము కొంతవఱకును దేశస్థితి ననుసరించియుండును.

శీతోష్ణస్థితి

ఉష్ణమువలన మధ్యాహ్ననిద్ర, సోమరితనము అలవడును. భూమి మిగుల సారముగల్గియున్న గొంచెముగా దుక్కిచేసి విత్తులు చల్లినను అధికముగ పంటలు పండును. ఇందుచేతను పరిశ్రమ యధికముగ నక్కఱలేనందున జనులు చుఱుకులేనివా రగుదురు. మనపూర్వులు మునుపు గంగా ప్రాంతముల నాక్రమించి స్వాధీనము చేసికొన్నందున, ఆ భూములు సహజ సస్యాఢ్యములౌటచే బనిపాటలు చాలించి కాలక్రమమున దోస్సార మనస్సత్వవిరహితులై మందులై పౌరుషహీనులై పౌరుషము లేకుండుటయే పరమధర్మంబని వాదించు నంతటి క్షీణతకు లోనైరి. ఇంగ్లాండునందు చలి మిక్కుటముగాన ఎంతో కడంకమై ప్రయాస పుచ్చుకొనినంగాని దేహమున నుడుకెత్తి చెమటబట్టి యారోగ్యము గలుగదు. మఱియు నిక్కడికన్న నక్కడ జీవితాధారములు (కంబళ్ళు, బనాత్ చొక్కాయలు మొదలగునవి) యెక్కువ గావలయుగాన నల్పసంపాదనమున దృప్తిజెంది చెట్ల క్రింద బరుండి గుఱక లిడి నిద్రించుటకు వలనుపడదు. కావుననే యూరోపియనులు మనకన్న నెక్కువ దేహసత్త్వమును మనస్థైర్యమును పట్టుదలయు గలవారుగానున్నారు. మనమున్నట్టుండి బహుపరాక్రమముతో నారంభశూరులమై కొంతసేపుపనిజేసి అనతి కాలమ్మున నలసటగొని శ్రద్ధ చాలించి మఱల నెంతవడికోకాని పనికి బూనుకొనము. ఇంగ్లాండులో జలి యొకటియేకాదు. భూమియు నిటవలె నచట బోతరించినదికాదు. కావున నొడలు వంచి శ్రమతో సేద్యము జేయ నిది ఫలప్రదంబు గాజాలదు.

మనరాష్ట్రములో నెన్నిసత్తువ లున్ననేమి? ఆశంసగలిగి మహోత్సుకత శ్రద్ధాళువులై యనవరత ప్రయత్నముం జేయుచు