పుట:Bhaarata arthashaastramu (1958).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుక్తియు, 50 రూపాయలయందుగల యంత్యప్రయోజనమును ఇంచుమించు సమానములనుట. ప్రతి క్రయ విక్రయములయందును నాలుగు విధములైన మదింపులు వేయబడును. ఎట్లన:-

కొనువాడు వేయునవిరెండు:- రూపాయల యుపయుక్తతంగూర్చిన మదింపు ఒకటి. ఎద్దునుంగూర్చిన మదింపు రెండు.

అమ్మువాడు వేయునవిరెండు:- ఎద్దుయొక్క యుపయుక్తతంగూర్చిన దొకటి. రూపాయల యుపయుక్తతంగూర్చినది రెండు.

కొనువానికి రూపాయలయందలి యాదరమునకన్న ఎద్దునందలి ప్రీతి యొకించుకయైన నధికముగను, అమ్మువానికి ఎద్దునందలి గౌరవమునకన్న రూపాయలయందలి మమత యొక్కింతయైన నధికముగను ఉన్నంగాని వినిమయము సిద్ధింపదు. అట్లగుట:-

ప్రయోజనముచే ధరలు నిర్ణయింపబడునని యొకరుచెప్పిన, ధరలచే ప్రయోజనము నిశ్చయింపబడునని యేల ప్రతివాదము సేయ గూడదు? చూడుడు! వస్తువునందలి ప్రీతి నాణెములగుండ వ్యక్తమాయె ననుట యేమాత్రము సత్యమో, నాణెములయందలి ప్రీతి వస్తువుగుండ వ్యక్తమాయెననుటయు నామాత్రము సత్యమే! మనము వాడుకలో క్రయికులు విక్రయికులని భిన్నపక్షములకుం జేరినవారో యనురీతి వారిని వ్యవహరింతుము. కాని శోధించి చూచిన నిరుతెగల వారును క్రయికులే విక్రయికులే. వర్తకుడు సరకులనమ్ము. రూపాయల గొనును. వినియోజకుడు రూపాయల నమ్మును. సరకులం గొనును! కావున వస్త్వాదరంబు రూప్యములచే గొలువబడుననుట యబాధితంబైన మతంబుగాదు. రూపాయలయొక్క యుపయోగము సరకులచే గొలువబడుచున్నదన్నను సంభావ్యమే.

ధరలచే ప్రయోజనము స్థాపింపబడెడు ననుటకు దృష్టాంతములు మునుపే చూపియున్నాము. వెలలు వ్రాలిన గిరాకి యుచ్ఛ్రితమగును. దీనికొక యపూర్వహేతువు ప్రదర్శింపగలము. ఖరీదు శ్రమ